Hyderabad House | సరికొత్త సేవలతో నగరంలో హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ రీలాంచ్..

Featured Posts food news Health Life Style Recipes Top Stories Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ హైదరాబాద్, 21,నవంబర్, 2021: 1975 లో స్థాపించిన డెక్కన్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ పునః ప్రారంభమైంది. హైదరాబాదు నుంచి తన ప్రయాణం ప్రారంభించి పలు దేశాలలో హైదరాబాదీ ఫుడ్ కు ప్రాచుర్యం కలిపిస్తూ తదుపరి పలు కారణాలతో మూతపడిన ఈ రెస్టారెంట్ బ్రాండ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. బేగంపేట, సికింద్రాబాద్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర పశు సంవర్థక,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొని లాంఛనంగా రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రెస్టారెంట్ లో కలియ తిరిగి రెస్టారెంట్ లో అందించే ఫుడ్ మెనూ గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాదు ఫుడ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన రెస్టారెంట్ తిరిగి ప్రారంభం కావడం సంతోషాన్నిస్తున్నదని అంటూ యాజమాన్యాన్ని అభినందించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రెస్టారెంట్ ల రంగం మళ్లీ తిరిగి పునః వైభవాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ గతాన్ని వివరించిన రెస్టారెంట్ బ్రాండ్ వ్యవస్థాపకుల కుటుంబానికి ప్రతినిధి జుబైర్ మాట్లాడుతూ హైదరాబాద్ హౌస్ అనే రెస్టారెంట్ ఎన్నో దశాబ్దాల క్రితం ప్రారంభమైందన్నారు.

1975 లో తన తండ్రి మిర్ మజారుద్దీన్, అతని సోదరుడు మిర్ అన్వరుద్దీన్ లు, హైదరాబాదు నగరంలో క్యాటరింగ్ బిజినెస్ లో ఎంతో పేరు ప్రతిష్టలు గడించిన తర్వాత తమ వంటకాలను ప్రజలకు మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఈ రెస్టారెంట్ కు స్వీకారం చుట్టడం జరిగిందని వివరించారు. అయితే ధమ్ బిర్యానీ లాంటి వాటిని తక్కువ మోతాదులో తయారు చేసి సరఫరా చేయడం ఎంతో కష్టసాధ్యం లేదా కుదరని పని అయితే తన వద్దకు వస్తున్న వారిని నిరాశ పరచడం కూడా ఇష్టం లేని మజర్ మదిలో మెదిలిన సరికొత్త ఆలోచనే హైదరాబాద్ హౌస్ ఫుడ్ జాయింట్ లకు నాంది పలికిందని ఆయన వివరించారు. అంటే ఈ ఫుడ్ జాయింట్ ల ద్వారా తక్కువ మొత్తాలలో కూడా హైదరాబాదీయులకు తమ బిర్యానీ తో పాటూ ఇతర వంటకాలను రుచి చూపించడానికి వీలు కలిపించే మార్గం దొరికిందని, అలా ప్రారంభమైన మొదటి అవుట్ లెట్ ఎంతో ప్రాచుర్యం పొందిన తర్వాత నెమ్మదిగా హైదరాబాదులోని పలు ప్రాంతాలలో మరిన్న హైదరాబాద్ హవుస్ పుఢ్ జాయింట్ లను ప్రారంభించడమే కాకుండా నెమ్మదిగా దేశ వ్యాప్తంగానే కాకుండా ఆస్ట్రేలియా, నేపాల్, సౌదీ అరేబియా, దుబాయి వంటి దేశాలకు కూడా విస్తరించిందని తెలిపారు.

అయితే పలు దురదృష్టకరమైన సంఘటనలు, కారణాల చే హైదరాబాద్ హౌస్ మూత పడింది. ఇలా మూత పడిన హైదరాబాద్ హౌస్ ఫుడ్ జాయింట్ ను అదే పేరుతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మట్ లో మజారుద్దీన్, అతని కుమారుడు జుబేర్ లు కలసి మరో మారు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఉత్పాతం నుంచి ప్రజలు తేరుకుంటున్న వేళ తమ మొదటి అవుట్ లెట్ ను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రెస్టారెంట్ వ్యవస్థాపకులు జుబేర్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, హైదరాబాద్ హౌస్ జనరల్ మేనేజర్ కౌశిక్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

Corona Virus | బూస్టర్ డోస్ లు ఉపయోగకరమా కాదా..? పరిశోధకులు ఏమంటున్నారు..?
Hyderabad House | సరికొత్త సేవలతో నగరంలో హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ రీలాంచ్..
వీడియో వైరల్ | పాటపాడిన క్రీడాకారిణి సెరెనా విలియమ్స్
Hyderabad House -A True Hyderabad Food Brand Known For Its Deccan Delicacies Is Re-Launched..
US FDA Grants Breakthrough Designation For Early-Stage Breast Cancer Detection Blood Test Developed In India..