Sat. Apr 20th, 2024
Human trafficking racket

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 6,2022: సైబరాబాద్ పోలీసులు మంగళవారం మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు రట్టు చేశారు. వివిధ దేశాలకు వేలాది మంది బాధితులను తరలిస్తుండగా బ్రోకర్లు పట్టుబడ్డారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న17మందిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా, 34 మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమీషనర్, స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, సైబరాబాద్ పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), ఇతర స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, స్థానిక పోలీసులు ఈ కేసులో ప్రమేయం ఉన్న 17 మందిని అరెస్టు చేశారు. నిందిస్తులను పట్టుకునేందుకు దాదాపు రెండు నెలల పాటు పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించారు.

Human trafficking racket

” గత మూడు నాలుగు సంవత్సరాల్లో నిర్వాహకులు దాదాపు 14,000 మంది మహిళలను అక్రమ రవాణా చేశారు. వెబ్‌సైట్‌లు, మొబైల్ ఫోన్ ఆధారిత అప్లికేషన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.

హైదరాబాద్ నగరంలోని దాదాపు 20హోటళ్లు, పలు ఓయో రూమ్స్ లో ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ” వాట్సాప్ గ్రూపుల ద్వారా పరస్పరం సంబంధాలు కొనసాగిస్తూ.. కస్టమర్లు, బాధితులకు కూడా ప్రయాణ, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు” అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.