Thu. Mar 28th, 2024
happy moments

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 29,2022: అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు. అరచేతి గీతల్లో ఉండదు. అలసిపోని గుండెల్లో నుంచి వస్తుంది. అంతులేని పట్టుదల, అకింతభావంలో ఉంటుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. జీవితం మనం కోరుకున్న పాటలు వినిపించే మ్యూజిక్ ప్లేయర్ కాదు..

అది ఒక రేడియో లాంటిది.. మనం ప్రతి ఫ్రీక్యూన్సీకి అడ్జస్ట్ అయి అందులో ఏది వస్తే దానిని ఆస్వాదించాలి.. పూజలు పునస్కారాలు అక్కర్లేదు. లేనివాడికి ఒక్క పూట అన్నం పెట్టిచూడండి పుణ్యం,పురుషార్థం వెతుకుంటూ వస్తాయి…నీ మేలు కోరేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు.

happy moments

నీకీడుకోరేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటారు. నీ భజన చేస్తూనే ఉంటారు. భజన చేసేవారుకాదు ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు. సంపాదిస్తునంత కాలం అందరికి మీరు ఆత్మీయలే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారు అవుతారు.. అన్ని ఉన్నప్పుడు మనతో వచ్చేవారిని గుర్తుపెట్టుకోవాలి.. ఏమిలేనప్పుడు మనతో వచ్చేవారిని గుండెల్లో పెట్టుకోవాలి.

సంపాదన వేటలో పడి జీవితాన్ని అనందంగా గడపటం మరచిపోతున్నారు కొందరు. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసిన జరిగిపోయిన కాలాన్ని కొనలేము. తరిగిపోయిన వయసును తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపటానికి ప్రయత్నించండి..