Fri. Mar 29th, 2024
VC_neerajaprabhakar

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి3,2023: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు వ్యాపార ఒరవడిని అలవరచుకుని, అందులో మెలకువలు నేర్చుకుంటేనే సాగు లాభసాటిగా ఉంటుందని, భారత దేశంలో ఉద్యాన రంగానికి ఉన్న అపారమైన అవకాశాల దృష్ట్యా, దేశ ఆర్థిక అభివృద్ధిలో భవిష్యత్తులో ఉద్యన రంగాందే కీలక పాత్రగా ఉండనుండదని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు.

వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలలో గ్రామీణ యువతకు ఉద్యాన రంగంలో వ్యాపార అవకాశాలపై నిర్వహించిన ఒకరోజు జాతీయ శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

తెలంగాణ ప్రభుత్వ- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తో కలిసి మోజర్లలోని ఉద్యాన కళాశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యాన రైతులు సంగటితంగా ఉండి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను, అనుబంధ ఉత్పత్తులని ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకోగలిగితే భవిష్యత్తులో మంచి లాభాలు వారికుంటాయన్నారు.

సేంద్రీయ కూరగాయలు, పండ్లు, దేశవాళి రకాల విత్తన ఉత్పత్తి పంటకోత అనంతర ఉద్యాన పంటల విలువల జోడింపు, హరితగృహాల్లో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల సాగు, తేనెటీగల పెంపకం, వర్మి కంపోస్ట్, మృత్తిక పరీక్షలలో నైపుణ్యం సాధిస్తే, వాటిని గ్రామీణ యువత ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

వినియోగదారులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉద్యాన పండ్లు, కూరగాయలపై మొగ్గు చూపుతున్న నేపథ్యం ఇందుకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. డ్రోట్ టెక్నాలజీ, సాయల్ బేస్డ్ సెన్సార్ టెక్నాలజీ, ఈ మార్కెట్లో అనుసందానమై రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోగలిగితే గ్రామీణ వ్యవస్థ సైతం బాగుపడుతుంది.

VC_neerajaprabhakar

నైపుణ్యంతో కూడిన ఉద్యాన విద్యను అందించడమే ధ్యేయంగా వర్సిటీలో పాఠ్యాంశాల బోధన, ప్రాక్టికల్స్ ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమల స్థాపనకు విద్యార్థులు మొగ్గు చూపాలని ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ అన్నారు.

టిష్యూ కల్చర్ అరటి మొక్కల ఉత్పత్తిని, దేశవాళీ కూరగాయల లో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని రైతు స్థాయిలో సైతం చేపట్టి రైతే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చని కార్యక్రమం కోఆర్డినేటర్, మోజెర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల ఎదుగుదలకు కావలసిన అత్యంత అనుకూల వాతావరణం, నేలలు ఇక్కడ ఉన్నాయని, సంవత్సరం అంతా పని దినాలు, ఆదాయంతో ఎగుమతి అవకాశాల సైతం ఉద్యాన ఉత్పత్తులకే ఉన్నాయని ఆయన తెలిపారు.

రసాయన పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆకుకూరలను హైడ్రోపోనిక్స్ ద్వార పండించవచ్చని అర్బన్ కిసాన్ సీఈవో డాక్టర్ పి. సాయిరాం రెడ్డి చెప్పారు.

టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసిన అరటి మొక్కల ధ్రువీకరణకు తెలంగాణ రాష్ట్రంలో మేలైన వాతావరణం ఉందని, చాలామంది ముందుకు వస్తున్నారని ఇంద్రప్రస్థ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సుహేల్ ఖాన్ అన్నారు. రైతులని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు కాల్గుడి సంస్థ ముందుంటుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేణుమార్గం పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని రైతులు వాటిని సద్వినియోగ చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల ఆఫీసర్ కే. సురేష్ అన్నారు. భారతీయ వైద్యంలో ఔషధ సుగంద్ర ద్రవ్య మొక్కల ప్రాధాన్యత ఎంతో ఉందని, రోజువారి ఆరోగ్యం కాపాడడంలో కూరగాయలది ప్రధాన పాత్రని ఆయన తెలిపారు.

నాణ్యమైన నర్సరీ మొక్కల ఉత్పత్తి విధానాలపై వర్సిటీ డీన్ డాక్టర్ అడప కిరణ్ కుమార్ మాట్లాడారు. ఈ జాతీయ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 80 పైగా ఔత్సాహిక యువ రైతులు, ఉద్యాన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఉద్యాన శాఖ అధికారులు, బీటెక్ విద్యార్థులు, ఉద్యాన రంగ నిపుణులు, బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు, విజయపథంలో ఉన్న ప్రైవేటు సంస్థల సీఈవోలు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు.

అలాగే అంటు కూరగాయల మొక్కల ఉత్పత్తి, రక్షిత కూరగాయల సాగు, విలువ ఆధారిత ఉద్యాన ఉత్పత్తుల తయారీ, వర్మి కంపోస్ట్, జీవన ఎరువుల తయారీ, మృత్తిక, నీటి పరీక్షలు నీటి పరీక్షలతో పాటు ఉద్యానరంగంలో స్టార్ట్ అప్ లు, ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల ఆధారిత వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలపై అభ్యర్థులకు నిపుణులతో శిక్షణ ఇచ్చిన్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పిడిగం సైదయ్య వెల్లడించారు.