Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే17,2023: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ వినూత్నప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకులకోసం ఎగిరిగంతువేసే ఆఫర్ ఇచ్చింది. మీడియా నివేదికల ప్రకారం గురువారం, హాంకాంగ్ నాయకుడు జాన్ లీ తన దేశం విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలు,పెట్టుబడిదారులను ఆకర్షించడానికి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత విమానాలను ఇస్తుందని ప్రచారం ప్రారంభించారు.

హలో హాంగ్ కాంగ్! స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. హాంకాంగ్ టూరిజం బోర్డు ‘హలో, హాంకాంగ్’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రారంభించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం బోర్డు 5 లక్షల ఉచిత విమాన టిక్కెట్లను ఇవ్వబోతోంది.

హాంకాంగ్‌ను ఆస్వాదించడానికి ఉచిత విమాన టిక్కెట్లు ,వోచర్‌లు ఇస్తున్నట్లు బోర్డు పేర్కొంది. మీరు మార్చి నుంచి టూర్ ను ఆనందించవచ్చు. ఇది కాకుండా 80,000 టిక్కెట్లతో పాటు చౌకగా విమాన టిక్కెట్లు కూడా ఇవ్వనున్నారు.

టిక్కెట్లు ఇలా బుక్ చేసుకోండి..

హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రెడ్ లామ్ టిన్-ఫూక్ మాట్లాడుతూ హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ క్యాథే పసిఫిక్, హెచ్‌కె ఎక్స్‌ప్రెస్ అండ్ హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ ద్వారా ఉచిత టిక్కెట్లు ఇస్తామని. అందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దాని పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

హాంకాంగ్ పర్యాటక శాఖ..

కరోనా కారణంగా హాంకాంగ్ పర్యాటక శాఖ తీవ్రంగా నష్టపోయింది. గతేడాది 2022లో హాంకాంగ్‌కు కేవలం 6 లక్షల మంది విదేశీ పర్యాటకులు మాత్రమే వచ్చారు. 2018తో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ. గత మూడు సంవత్సరాలలో 130 కంటే ఎక్కువ అంతర్జాతీయ కంపెనీలు హాంకాంగ్‌లో తమ కార్యాలయాలను మూసివేసాయి.

పలు జపనీస్ కంపెనీల దివాలా తీశాయి. గతేడాదిలోనే 1 లక్షా 40 వేల మందికి పైగా హాంకాంగ్‌ను విడిచిపెట్టారు. అప్పుడు హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం క్షీణించింది. దీంతో హాంగ్ కాంగ్ పర్యాటకులకు ప్రత్యేక ఆఫర్ ను అందిస్తున్నారు.