Wed. Mar 29th, 2023
press-club
Spread the News

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 5,2022: ప్రెస్ క్లబ్ కమిటీ, జీవాశ్రీఆయుర్వేదిక్ వెల్ నెస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుర్వేదిక్ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరాన్ని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్ మోహన్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తి కత్తి మీది సాము లాంటిదని, ప్రతిరోజూ విధుల్లో ఒత్తిడి లోనవుతారన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రెస్ క్లబ్ అకాడమీ సభ్యులను, వెల్ నైన్ సెంటర్ నిర్వాహకులను ఆయన అ భినందించారు.

press-club

ఈ హెల్త్ క్యాంప్ లో దాదాపు 300 మంది జర్నలిస్టులకు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం నెల రోజులకు సరిపడా ఉచిత మందులను పంపిణీ చేశారు.

కొందరికి సహజ సిద్ధమైన వైద్యంతో పాటు లైఫ్ స్టైల్, స్ట్రెన్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి వైద్య పరీక్షలుచేయించుకున్నారు.

వెల్ నెస్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫణి శ్రీ కొంటె ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, కార్యదర్శి రవి కాంత్ రెడ్డి, ట్రెజరర్ రాజేష్, ఉప కార్యదర్శి హరి ప్రసాద్, సభ్యులు బాబురావు, పద్మా దేవి, రమాదేవి, ఉమాదేవి, వసంత,శ్రీనివాస్ పర్యవేక్షించి విజయవంతం చేశారు.