Fri. Mar 29th, 2024
ustaad-bhagat-singh

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 11,2022: పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈసందర్భంగా సినిమా యూనిట్ కొత్త పోస్టర్‌ ను విడుదలచేసింది. ఇందులో పవర్ స్టార్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.

నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్, పవన్ కళ్యాణ్ టీ గ్లాసు పట్టుకుని మోటార్‌బైక్‌కి ఎదురుగా నిలబడి, కనిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” పేరుపెట్టారు. గతంలో భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి క్లారిటీ ఇస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

https://www.youtube.com/shorts/Vdsrvi8EXog

SOURCE FROM TWITTER

గత సంవత్సరం ప్రకటించిన ఈ చిత్రం, బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ (2012) తర్వాత పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ రెండవసారి కలిసి పనిచేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాకు మొదట భవదీయుడు భగత్ సింగ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మార్చారు.

https://www.youtube.com/shorts/Vdsrvi8EXog

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని , వై రవిశంకర్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా ఉన్నారు.

SOURCE FROM TWITTER

https://youtube.com/shorts/Vdsrvi8EXog?feature=share

ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు” చిత్రాన్ని కూడా చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామా మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.