Fri. Mar 29th, 2024
Goose Bumpsey: Dussehra Godfather trailer release for mega fans

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 28,2022:మెగా ఫ్యాన్స్ కు దసరా ముందుగానే వచ్చేసింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తు న్న మెగాఫ్యాన్స్ కు “గాడ్ ఫాదర్ “ట్రైలర్ రూపంలో దసరా పండుగ వచ్చేసింది. మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ రోజు అనంతపురంలో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. రెండు నిమిషాల పన్నెండు సెకన్ల డ్యూరేషన్ తో వచ్చిన ఈ ట్రైలర్ మెగా అభిమానులకు మెగా కిక్కిస్తోంది.

Goose Bumpsey: Dussehra Godfather trailer release for mega fans

చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయ్.. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లు ట్రైలర్‌ ఉండడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌గ్రాండ్‌ గా జరుగుతోంది. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు.

ఈ ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్‌తో ఇరగదీశారు. అక్టోబర్ 5న ఈ సినిమా థీయేటర్లలో రిలీజ్ కానుంది.

Goose Bumpsey: Dussehra Godfather trailer release for mega fans