Thu. Mar 28th, 2024
increased immunity

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 3,2023: ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెరుగైన ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఏమేం చేయాలి.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధులకు జీవనశైలిలో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు చేయడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు సోకకుండా ఉండొచ్చు. అంతేకాకుండా, జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

ఈ ఆరోగ్యకరమైన మార్పుల విషయంలో అన్ని వయసుల వారికి శ్రద్ధ అవసరం. అందుకోసం ఇవి తప్పనిసరిగా చేయాలి.

పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం.. 

increased immunity

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శరీరానికి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తిని పొందడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

ఇందుకోసం పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు పుష్కలంగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. పెద్దలు రోజుకు కనీసం ఐదు భాగాలు (400 గ్రాములు) పండ్లు, కూరగాయలను తినాలి.

వ్యాయామం..

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి. పెద్దలు వారానికి కనీసం150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలి.

శరీరంలో హార్మోన్ల సమతుల్యత ,రక్త ప్రసరణను నిర్వహించడానికి,మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రెగ్యులర్ వ్యాయామం అవసరం. ఈ ఒక్క అలవాటుతో మధుమేహం-గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

increased immunity

తగినంత నిద్ర..

నిద్ర లేకపోవడం ఇన్సులిన్ నిరోధకత, బరువు, రోగనిరోధక శక్తి ,మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ రోజుకి6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

పలురకాల అధ్యయనాలలో అనేక తీవ్రమైన వ్యాధులు నిద్ర లేకపోవడం వల్లనే తలెత్తుతున్నాయని తేలింది.

ఎక్కువసేపు కూర్చోవడం-స్క్రీన్ టైమ్..

రోజులో ఎక్కువసేపు కూర్చుని గడిపే వ్యక్తులలో అనేక రకాల వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం మేలు. మొబైల్, లేదా కంప్యూటర్‌పై ఎక్కువ సమయం గడపడం చాలా ప్రమాదం.

increased immunity

ఈ రెండిటి వల్ల మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచు తాయి. కాబట్టి ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం మానేసి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి ప్రయ త్నించండి. వీటన్నిటినీ పాటించడంద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.