Sat. Jun 10th, 2023
Godrej & Boyce aims to strengthen Vaccine Cold Chain till the last mile, for India and the World
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,భారతదేశం, ఫిబ్రవరి10, 2021 ః గోద్రేజ్‌ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ ఆరంభమైన నాటి నుంచి భారతదేశం స్వీయ సమృద్ధి సాధించేందుకు తోడ్పడుతూనే ఉంది. దేశపు ఆరోగ్య సంరక్షణ  మౌలిక వసతులను  ఓ అడుగు ముందుకు తీసుకువెళ్తూ గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ తమ వ్యాపార విభాగం గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ద్వారా భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న కోవిడ్‌–19 వ్యాక్సినే షన్‌ డ్రైవ్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ అత్యాధునిక, భారతీయ తయారీ, మెడికల్‌ రిఫ్రిజిరేషన్‌ పరిష్కారాలను అందిస్తుంది. అతి సున్నితమైన వ్యాక్సిన్‌ల కోసం సరైన ఉష్ణోగ్రతలను నిర్వహించడంలో ఇవి తోడ్పడుతున్నాయి. నేడు తమ పోర్ట్‌ఫోలియోకు అత్యాధునిక, అలా్ట్ర లో టెంపరేచర్‌ ఫ్రీజర్లను సైతం జోడించడం ద్వారా తమ వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్‌ను మరింతగా బలోపేతం చేసింది. ఈ అత్యాధునిక వైద్య ఫ్రీజర్లు,ప్రాణాలను కాపాడే వైద్య సరఫరాలను –80 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో సైతం నిల్వ చేస్తాయి.గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ప్రస్తుతం వ్యాక్సిన్‌ రిఫ్రిజిరేటర్లను అందిస్తుంది. వీటిని 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతను అత్యంత సున్నితమైన కోవాగ్జిన్‌ ,కోవి షీల్డ్‌ వ్యాక్సిన్‌ల నిల్వ కోసం భారతదేశంలో వినియోగిస్తున్నారు.

Godrej & Boyce aims to strengthen Vaccine Cold Chain till the last mile, for India and the World
Godrej & Boyce aims to strengthen Vaccine Cold Chain till the last mile, for India and the World

ఈ పోర్ట్‌ఫోలియోకు నూతన జోడింపుగా అలా్ట్ర లో టెంపరేచర్‌ ఫ్రీజర్లు నిలుస్తాయి. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌లకు ఇవి తగినట్లుగా కూడా ఇవి ఉంటాయి. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లు అధిక ఉష్ణోగ్రతలో పాడైపోతాయి కావున వాటిని అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. గోద్రేజ్‌ అలా్ట్ర లో టెంపరేచర్‌ ఫ్రీజర్స్‌లో అంతర్గతంగా భద్రతా వ్యవస్ధలు ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా ఒత్తిడి పెరిగితే అలారం మోగించే నిర్మాణమూ దీనిలో ఉంది. స్థిరంగా 48 గంటల పాటు ఇది ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. ప్రస్తుతం సంవత్సరానికి 12వేల యూనిట్ల అలా్ట్ర లో టెంపరేచర్‌ ఫ్రీజర్లను తయారుచేసే సామర్థ్యం గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌కు ఉన్నప్పటికీ,  అంతర్జాతీయ డిమాండ్‌కు తగినట్లుగా దీనిని 30వేల యూనిట్లకు విస్తరించే పనిలో ఇది ఉంది. జమ్షీద్‌ గోద్రేజ్‌, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అతిపెద్ద సవాలుగా కోల్డ్‌ చైన్‌ ఎక్విప్‌మెంట్‌ నిలుస్తుంది. ఓ గ్రూప్‌గా నూతన సాంకేతికతలను తీసుకురావడంతో పాటుగా దేశం స్వయం సమృద్ధి సాధించేలా తోడ్పాటునందిస్తున్నాం..’’ అని అన్నారు.