Fri. Mar 29th, 2024
'Dharmachakram' first look..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 27,2022: సంకేత్ తిరు మనీడి, మౌనిక చౌహాన్ జంటగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో నాగ్ ముంతా దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా “ధర్మచక్రం”. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా “ధర్మచక్రం” ఫస్ట్ లుక్ విడుదలవ్వగా దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాకు ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రణయ్ రాజపూటి సంగీతం సమకూరుస్తున్నారు.

” ధర్మచక్రం” మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుందని” దర్శకుడు నాగ్ ముంతా తెలిపారు. “అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము.

హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటిస్తామని” ఆయన పేర్కొన్నారు.

తారాగణం..

'Dharmachakram' first look..

సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్, చైతన్య, ప్రవీణ్ కుమార్, ధృవ, జానీ ఫీవర్ మైలవరం, నరసింహా రావు తదితరులు ఉన్నారు. దర్శకుడు: నాగ్ ముంతా, నిర్మాత: జిపి రెడ్డి, సినిమాటోగ్రఫర్: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: ప్రణయ్ రాజపూటి, యాక్షన్: హంగామా కృష్ణ బమ్మిడి, పి ఆర్.ఓ : లక్ష్మీ నివాస్.

ఇవీ కూడా చదవండి..

వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూచూస్తాం..:జనసేన పార్టీ ఛీఫ్
బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్నిఅపహస్యం చేశారు: జనసేన అధినేత
నన్ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోను: పవన్ కళ్యాణ్

”AP04 రామాపురం” సినిమా ట్రైలర్ రిలీజ్

20 రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..

భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్

‘ త్వరలో మరో మహమ్మారి.. పరిస్థితులు చాలా ఘోరం ఉండవచ్చు’

ఎన్‌డీటీవీ స్వాధీనంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు

 చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. పలుచోట్ల లాక్ డౌన్..