Wed. May 31st, 2023
Upasanakonidela_365
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 14,2023:టాటా గ్రూప్ నకు చెందిన డైమండ్ బోటిక్ జోయా, హైదరాబాద్‌లో తన ఫ్లాగ్‌షిప్ బోటిక్‌ను గ్రాండ్‌గా ప్రారంభించినట్లు ప్రకటించింది.

జూబ్లీ హిల్స్‌లోని విలాసవంతమైన ప్రాంగణంలో జోయా లగ్జరీ స్టోర్ ను ఏర్పాటుచేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ముఖ్యఅతిధిగా హాజరై ఈ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ, “నేటి తరం మహిళల కోసం క్రియేటివ్ గా రూపొందించిన జోయా కలెక్షన్ ఎంతో బాగుందని, అందంగా రూపొందించిన ఆభరణాల వెనుక అర్థవంతమైన కథనాలు నాకు నచ్చాయి.

Upasanakonidela_365

ఈ బోటిక్ ,సమకాలీన డిజైన్ ద్వారా భారతదేశం గొప్ప సంప్రదాయానికి సజీవంగా ఉండే అనేక సంపదలను హైదరాబాద్ ఖచ్చితంగా ఆస్వాదిస్తుంది.” అని ఆమె అన్నారు.

జోయా, హౌస్ ఆఫ్ టాటా నుంచి వచ్చిన అద్భుతమైన డైమండ్ బోటిక్, ఇది విలాసవంతమైన ఆభరణాల బ్రాండ్, నైపుణ్యం కలిగిన, విశిష్టమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందిందని టైటాన్స్ సౌత్ బిజినెస్ హెడ్ శరద్ ఆర్ తెలిపారు.