365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్19,2021: ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటైన గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్) తమ ఆరోగ్య పరిస్థితి విషయంలో నిపుణుల సలహాలు కోరేవారికి ప్రతి బుధవారం ఉచిత కోలోరెక్టల్ స్పెషాలిటీ కన్సల్టింగ్ క్యాంపులు నిర్వహిస్తోంది. సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ , హెచ్‌పీబీ సర్జన్ డాక్టర్ భరత్‌కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ టి.వి. ఆదిత్య చౌదరి రోగులకు, వారి కుటుంబసభ్యులకు అందుబాటులో ఉండి, ఉచితంగా సలహా, సాయం అందిస్తారు.
ఈ ఉచిత శిబిరాల గురించి గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్) సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెచ్‌పీబీ సర్జన్ డాక్టర్ భరత్‌కుమార్ మాట్లాడుతూ, “చాలామంది తమకున్న పైల్స్ (హెమరాయిడ్స్), ఫిషర్లు (ఆనల్ అల్సర్), మలంలో రక్తం కారడం, ఆ సమయంలో నొప్పి, ఫిస్టులా లాంటి సమస్యలను మౌనంగా భరిస్తుంటారు. ఇలాంటి సమస్యలకు వైద్యం చేయించుకోడానికి ముందుకురాని చాలామందిని మేం చూశాం. ఉచిత కన్సల్టింగ్ శిబిరాల వల్ల ఇలాంటివారికి సాయం అందుతుంది” అని చెప్పారు.
ఇదే విషయమై గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (లక్డీకాపుల్) సీఈవో గౌరవ్ ఖురానా మాట్లాడుతూ, “అత్యున్నత స్థాయి చికిత్సలకు అత్యుత్తమ చికిత్స అందించే గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి ఇలాంటి ఉచిత కన్సల్టింగ్ క్యాంపుల నిర్వహణతో సమాజానికి మేలుచేయడంలోనూ ముందుంటుంది” అని తెలిపారు.
కోలోరెక్టల్ సమస్యలకు త్వరగా చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఈ సమస్యలు ఎక్కువై, క్యాన్సర్‌గా కూడా మారి, అవి ముదిరితే ప్రాణాంతకం అవుతాయి. పేగుల క్యాన్సర్ ముందుగా పెద్దపేగుల్లో మొదలవుతుంది. అది మన ఆహార జీర్ణవ్యవస్థలో చివరి భాగం. పేగుల క్యాన్సర్ సాధారణంగా పెద్దవయసువారికి వస్తుంది. ఏ వయసువారైనా దానికి గురికావచ్చు. అది చిన్నగా, క్యాన్సర్ కాని రకం (బినైన్)గా మొదలవుతుంది. అప్పుడు పేగుల లోపల పాలీప్స్ అనే కణాల సముదాయం ఏర్పడుతుంది. కాలం గడిచేకొద్దీ వీటిలో కొన్ని పేగుల క్యాన్సర్‌గా మారి, బాధితుల ఆరోగ్యం, ప్రాణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. క్యాంపులు నిర్వహించనున్న గ్యాస్ట్రో నిపుణులు డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ ఆదిత్య చౌదరి(+91) 6366562039 నంబరుకు ఫోన్ చేస్తే ఉచిత కన్సల్టేషన్ స్లాట్ల బుకింగ్