Thu. Mar 28th, 2024
FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్‌, 22 జనవరి 2021 ః దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది సూక్ష్మ, చిన్న,మధ్య తరహా వ్యాపారస్తులకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ,దేశవ్యాప్తంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాలనుంచి 34  వాణిజ్య అసొసియేషన్ల సభ్యత్వం కలిగిన  ఫెడరేషన్‌ ఆఫ్‌ రిటైలర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఆర్‌ఏఐ) నేడు భారతప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ప్రతిపాదిత కోట్పా చట్టంలో సవరణలను వెనుక్కి తీసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. ఈ ప్రతిపాదిత సవరణల కారణంగా  పొగాకు,సంబంధిత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించే చిల్లర వ్యాపారస్తుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశాలున్నాయి.ఎఫ్‌ఆర్‌ఏఐ తెలంగాణా చాఫ్టర్‌ నేడు ఓ నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటుగా గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావును రాష్ట్రంలోని దాదాపు 6.5 లక్షల సూక్ష్మ వ్యాపారవేత్తలు వారిపై ఆధారపడ్డ 30 లక్షల మంది ప్రజల జీవనోపాధి ,  సంభావ్య వేధింపుల నుంచి కాపాడాల్సిందిగా అభ్యర్థించారు. రాష్ట్రంలో పొగాకు,సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం ద్వారా పొందే చిరు మొత్తాలతోనే వీరు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.దేశంలో అతి నిరుపేద వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎఫ్‌ఆర్‌ఏఐ ప్రాతినిధ్యం వహిస్తుంది, తమ ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపే అంశాలపై గొంతెత్తుతుంది,తమ అభిప్రాయాలను వెల్లడించలేని ఈ ప్రజల తరపున తమ వాదనను వినిపిస్తుంది. ఎఫ్‌ఆర్‌ఏఐ సభ్యులు తమ జీవనోపాధిని రోజువారీ అవసరాలను విక్రయించడం ద్వారా పొందుతున్నారు . సాధారణంగా సామాన్య ప్రజానీకం కోరుకునే బిస్కెట్లు, శీతల పానీయాలు, మినరల్‌ వాటర్‌, సిగిరెట్లు, బీడీ, పాన్‌ మొదలైనవి వీరు తమ చుట్టు పక్కల ప్రాంతాలలో విక్రయిస్తుంటారు. ఈ నిత్యావసర ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ఈ సూక్ష్మ వ్యాపారవేత్తలు నెలకు దాదాపు 15వేల రూపాయలను సంపాదిస్తుంటారు. ఈ మొత్తాలు తమ కుటుంబ సభ్యులకు రెండు పూటలా భోజనం పెట్టేందుకు కష్టంగా సరిపోతుంటాయి.

FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India
FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India

కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్స్‌ తదనంతర పరిస్థితుల కారణంగా వచ్చిన ఆర్థిక విచ్ఛిన్నం మరింతగా చిరు వ్యాపారుల ఆర్ధిక పరిస్థితిని దిగజార్చింది. ఇప్పుడు ప్రతికూల విధాన నిర్ణయాలు తీసుకుంటే వారి వ్యాపార కార్యకలాపాలు అస్థిర పడటంతో పాటుగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమూ ఉంది. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌ఏఐ,దాని సభ్య సంస్థలు దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన కోట్పా చట్టం 2020 సవరణల పట్ల ఆందోళనతో ఉన్నాయి. దీని ద్వారా సిగిరెట్లును ప్యాక్‌లుగా కాకుండా విడిగా అమ్మటాన్ని అనుమతించదు సరికదా 21 సంవత్సరాల లోపు వ్యక్తులకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని సైతం అనుమతించదు. షాప్‌ లోపల ప్రచారంపై కూడా నియంత్రణలు విధించడంతో పాటుగా ఇతరుల నడుమ దానిని ప్రోత్సహించడమూ అంగీకరించదు. ఇవన్నీ భారీ వ్యాపారవేత్తలకు ఎలాంటి ప్రభావం కలిగించవు కానీ  చిరు వ్యాపారవేత్తల వ్యాపారాలను నాశనం చేసేలా ఉన్నాయి.ఈ అంశం గురించి సలావుద్దీన్‌ డెక్కనీ, వైస్‌ ప్రెసిడెంట్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ రిటైలర్స్‌ అసొసియేషన్‌ ఆఫ్‌ ఇండియా,జనరల్‌ సెక్రటరీ, పాన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘మేము సవినయంగా గౌరవనీయ భారత ప్రధానమంత్రి మా పట్ల సానుభూతి చూపాల్సిందిగా, సంబంధిత మంత్రివర్గాన్ని తక్షణమే ప్రతిపాదిత కోట్పా సవరణ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే ఈ చట్టాలు అత్యంత కఠినమైనవి. దశాబ్దాలుగా విడిగా సిగిరెట్లు  విక్రయించడం వంటి వ్యాపారాలు కూడా నేరంగా పరిగణించడంతో పాటుగా చిన్న అతి క్రమణలకు కూడా కరడుగట్టిన నేరగాళ్లలా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చట్టాలు దీనిలో ఉన్నాయి. మరణానికి కారణమయ్యేలా ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు రెండు సంవత్సరాల జైలుశిక్షతో పోలిస్తే ఇది అసాధారణాలలో కెల్లా అసాధారణం అనిపిస్తుంది. ఇది ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒకరిపై యాసిడ్‌ పోయడం లేదా నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణం కావడం వంటి అంశాలతో సమానంగా పాన్‌, బీడీ, సిగిరెట్‌ విక్రయదారులను నిలిపింది. తమ రోజువారీ సంపాదన కోసం తీవ్రంగా కష్టపడే నిరుపేద, బడుగు వర్గాల ప్రజలకు సంబంధించి ఇంతటి కఠినమైన చట్టాలను ఎలా రూపొందించగలిగారు ?’’

FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India
FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India

‘‘ఇప్పటికే భారతదేశంలో పొగాకు నియంత్రణకు  సంబంధించి అత్యంత కఠినమైన నియంత్రణ చట్టాలు ఉన్నాయి. ఈ కారణం చేతనే చట్టబద్ధమైన పొగాకు వినియోగం గణనీయంగా తగ్గింది. ప్రస్తుత చట్టాలతో అక్రమ, స్మగుల్డ్‌ సిగిరెట్లు వృద్ధి చెందుతున్నాయి , ఈ చట్టాల వల్ల సంఘ వ్యతిరేక శక్తులకు ప్రయోజనం కలుగుతుంది. అలాంటప్పుడు ఈ అత్యంత కఠినమైన పొగాకు నియంత్రణ చర్యలు తీసుకోవడమనేది ఇతర ఆరోగ్య సమస్యలైనటువంటి కరోనా వైరస్‌తో పోరాటం, మధుమేహం, ఊబకాయం, మానసిక ఆరోగ్యం, గాలి కాలుష్యం తదితర కారణాల వల్ల పెరుగుతున్న వ్యాధుల కన్నా తీవ్రమైనదా అన్న సందేహం వస్తుంది. కరోనా వైరస్‌లా కాకుండా ఈ తరహా విధాన నిర్ణయాలు పూర్తిగా మన విధాన నిర్ణేతల చేతుల్లోనే ఉంటాయి. వారు తప్పనిసరిగా సానుభూతితో పరిశీలించాల్సి ఉంది. నేడు, మేము ఓ కమ్యూనిటీగా బాధితులుగా భావిస్తుండటంతో పాటుగా మమ్మల్ని  లక్ష్యంగా చేసుకున్నారనీ భావిస్తున్నాము. దయతో మమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాల్సిందిగా మోదీజీకి విజ్ఞప్తి చేస్తున్నాము’’అని అన్నారు.గతంలో విద్యాసంస్ధలకు 100 అడుగుల దూరంలో పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదనే నిబంధనను 100 మీటర్ల దూరంకు పెంచారు. ఈ ప్రతిపాదన పట్ల తన అసంతృప్తిని శ్రీ సలావుద్దీన్‌ వెల్లడిస్తూ ‘‘ మా సభ్యులు వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా పలు ఉత్పత్తులను అందిస్తుంటారు. మా సభ్యులు విక్రయించే ఉత్పత్తులలో సిగిరెట్లు,బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు సైతం ఉన్నాయి. చట్టం ప్రకారం మేము మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించము. అత్యంత రద్దీగా ఉండే ,జనాభా కలిగిన నగరాలలో ఈ తరహా నిబంధనలు ప్రాక్టికల్‌గా అసాఽధ్యం. చిల్లర వర్తకులు ఈ నిబంధన కారణంగా తమ కుటుంబ జీవనోపాధి గురించి  ఏమాత్రం ఆలోచించకుండా తామున్న ప్రాంతాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒకవేళ నూతన విద్యాసంస్థలు రిటైలర్‌ ఉన్న ప్రాంతంలోని 100 మీటర్ల లోపు వస్తే అతను మరలా తామున్న ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India
FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India

సూచించిన సవరణల కారణంగా పొగాకు ఉత్పత్తుల విక్రయం 21 సంవత్సరాల లోపు వ్యక్తులకు విక్రయించరాదు (గతంలో ఇది 18 సంవత్సరాలుగా ఉండేది). భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించి తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవడంతో పాటుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు అర్హత ఉంది. కానీ కూృరంగా,  అదే వ్యక్తి తమ ప్రాధాన్యతకనుగుణంగా ఓ పొగాకు ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి అర్హత లేదు. అదీ చట్టబద్ధంగా విక్రయించే చోట కూడా వారు కొనుగోలు చేసేందుకు అనుమతి లేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఇప్పటికే మైనర్లకు సిగిరెట్లను విక్రయించడం నిషిద్ధం. కాబట్టి చిక్కులను అర్థం చేసుకోలేని వ్యక్తులు పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారనే ఆందోళన అర్థరహితం.ప్రతిపాదిత సవరణ కింద ఈ తరహా లైసైన్సింగ్‌ అవసరాల నుంచి సైతం మినహాయింపు ఇవ్వాల్సిందిగా చిల్లర వర్తకులు అభ్యర్థిస్తున్నారు. నిరుపేద,చిన్న షాప్‌ కీపర్లు అతి కష్టంగా రోజుకు రెండు పూటల భోజనం చేస్తున్నారు. అలాంటి వారు లైసెన్స్‌ పొందడం కూడా కష్టం, కేవలం అదొక్కటే కాదు ప్రతి సంవత్సరం దానిని పునరుద్ధరించడమూ కష్టమే. పరిపాలనా నియంత్రణ ముసుగులో నిరంతరం వేధింపులు పెరుగుతాయి. ఇది కేవలం వ్యాపార నిర్వహణ ఖర్చులు పెంచడం మాత్రమే కాదు, అదే సమయంలో అది అవినీతి,దేశవ్యాప్తంగా లక్షలాది మంది షాప్‌కీపర్లపై వేధింపులనూ కలిగిస్తాయి.

FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India
FRAI Telangana appeals to the Prime Minister to order recall of proposed amendments in the COTPA law as they attack the livelihoods of petty retailers selling tobacco products across India

విదేశీ కంపెనీల కోసం నిరంతరం శ్రమిస్తున్న కొన్ని ఎన్‌జీవోలు స్థిరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా అన్యాయంగా ,అమలు చేయలేని చట్టాలను చిన్న దుకాణదారులకు వ్యతిరేకంగా తీసుకువచ్చేలా చేస్తున్నాయి. ఈ విధానాలు చిల్లర వర్తకుల  వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసి  అతి పెద్ద విదేశీ, ఈ–కామర్స్‌ కంపెనీలకు లబ్ధి చేకూరుస్తాయి.ఎఫ్‌ఆర్‌ఏఐ,దీని సభ్యులు, భారత ప్రభుత్వాన్ని ఆచరణాత్మకంగా,సమాన దృష్టితో చూడాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ప్రత్యేకించి సమాజంలో సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటికే వారు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ తరహా కఠినమైన, ఏకపక్ష,  అసమంజసమైన ఆంక్షలను మా వాణిజ్య హక్కు, జీవనోపాధిపై విధించవద్దని అభ్యర్ధిస్తున్నాము.