Sat. Jun 10th, 2023
Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ఫిబ్రవరి 2021 : ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక రహస్య నిబంధనలు ఏవో ఉంటాయి. కానీ భారతదేశంలో అతిపెద్ద డైనింగ్‌ ఔట్‌, రెస్టారెంట్‌ టెక్‌ పరిష్కారాల వేదిక డైనవుట్‌ మాత్రం తమ వినియోగదారులకు ఇలాంటి రహస్య నిబంధనలు లేదంటే పరిమితులు లేకుండా ఫ్లాట్‌ 50% తగ్గింపును రెస్టారెంట్‌ బిల్స్‌పై అందించబోతుంది. ఈ సంస్థ తమ ఆరవ ఎడిషన్‌ డైనవుట్‌  గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌  ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇది 26 ఫిబ్రవరి2021 నుంచి మార్చి  31,2021వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 20కు పైగా నగరాలలో 10వేలకు పైగా సుప్రసిద్ధ రెస్టారెంట్లలో జరుగనుంది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న సుప్రసిద్ధ హోటల్‌, రెస్టారెంట్‌ చైన్స్‌లో జెడబ్ల్యు మారియట్‌,  రాడిసన్‌, పరంపర, ఎయిర్‌లైవ్‌, అమోఘమ్‌– ద లేక్‌ వ్యూ రెస్టారెంట్‌, ఫెయిర్‌ఫీల్డ్‌ బై మారియట్‌– పామ్స్‌ కిచెన్‌, టీ–గ్రిల్‌, మ్యాడ్‌ ఓవర్‌ డోనట్స్‌, పిజ్జా హట్‌, బార్బిక్యు నేషన్‌, కేఫ్‌ ఢిల్లీ హైట్స్‌ వంటివి ఉన్నాయి.ఈ ఆఫరింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తే అదనంగా 15% రాయితీని సైతం పొందవచ్చు.

Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!
Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

దీనితో పాటుగా ఇంటర్‌మైల్స్‌ వినియోగదారులు డైనవుట్‌ పే ద్వారా చేసే ప్రతి 40 రూపాయలపై ఒక ఇంటర్‌మైల్‌ పొందవచ్చు.ఈ తాజా ఆఫర్‌ గురించి డైనవుట్‌ సీఈవో–కోఫౌండర్‌  అంకిత్‌ మెహరోత్రా మాట్లాడుతూ ‘‘తమకున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, 50% రాయితీ  అంటే, దానిని ఖచ్చితంగా తామందిస్తామనే అంశం వినియోగదారులకు చేరువ చేయడం. ఆన్‌లైన్‌ యుగంలో ఎన్నో బ్రాండ్లు భారీ రాయితీలంటూ ప్రకటనలు ఇస్తున్నాయి కానీ వాస్తవానికి అలా చేయడం లేదు. దీనివల్ల వినియోగదారులు నమ్మకం కోల్పోతున్నారు. ఇది పొగొట్టి, వారిలో నమ్మకం కలిగించే రీతిలో దీనిని తీర్చిదిద్దాం. 2021 వ సంవత్సరం అందరికీ ఓ మరుపురాని సంవత్సరంగా నిలుస్తుందని భావిస్తున్నాం’’  అని అన్నారు.