Fri. Apr 19th, 2024

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్‌, డిసెంబర్‌ 2, 2021: అజయ్‌శర్మను తమ ప్రెసిడెంట్‌గా నియమించుకున్నట్లు ఫ్లాష్‌గార్డ్‌ వెల్లడించింది. మొబైల్‌ యాక్సరీస్ మార్కెట్‌లో సుప్రసిద్ధ సంస్థగా ఫ్లాష్‌గార్డ్‌ను నిలబెట్టడంలో టెలికామ్‌ పరిశ్రమ, నాయకత్వ లక్షణాలు గురించి ఆయన అభిప్రాయాలు , నాయకత్వ లక్షణాలు కీలక పాత్ర పోషిస్తాయని కంపెనీ విశ్వసిస్తోంది.
అజయ్‌ పలు సంస్ధల్లో పనిచేశారు. వీటిలో మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ఫార్మటిక్స్‌ లిమిటెడ్‌, రోకిట్‌ ఫోన్స్‌, ఒబి మొబైల్స్‌,హెచ్‌టీసీ, ఉషా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వంటివి ఉన్నాయి.

తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఆదర్శంగా నిలిచిన ఆయన హెచ్‌టీసీతో మొదలు పెడితే సుప్రసిద్ధ మొబైల్‌ బ్రాండ్ల అభివృద్ధి, ఆవిష్కరణలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. అత్యంత గౌరవనీయ వ్యక్తులలో ఒకరిగా ఆయన నిలువడం మాత్రమే కాదు, మొబిలిటీ పరిశ్రమ పట్ల అద్భుతమైన అవగాహన ఆయనకు ఉంది. సాంకేతికతను, మార్కెట్‌ గమనం, వినియోగదారుల ప్రాధాన్యతలు,ఛానెల్స్‌, సరఫరా చైన్‌ పరంగా అన్వేషించే ఆయన మొబైల్‌ పర్యావరణ వ్యవస్ధ పట్ల సమగ్రమైన వీక్షణను తీసుకువచ్చారు.


అజయ్‌ శర్మ నియామకం గురించి ఫ్లాష్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ రావు మాట్లాడుతూ ‘‘ ఫ్లాష్‌గార్డ్‌ అధ్యక్షునిగా అజయ్‌ శర్మ మా సంస్థకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. టెలికామ్‌ పరిశ్రమలో అతని అపార అనుభవం కారణంగా అధ్యక్షునిగా ఆయన మాకు
అత్యుత్తమంగా సేవలనందించగలరు. మా మార్కెట్‌నూ విస్తరించగలరని నమ్ముతున్నాము. మా టీమ్‌లో ఆయన చేరడం వల్ల మా వ్యాపారాన్ని జాతీయంగా విస్తరించడంలో వ్యూహాత్మక వృద్ధి అంశాలలో దృష్టి పెట్టడంలో మాకు సహాయపడగలరు’’ అని అన్నారు.

తన అపాయింట్‌ మెంట్‌ పట్ల కృతజ్ఞతలు తెలిపిన అజయ్‌శర్మ మాట్లాడుతూ ‘‘ నా నాలుగు దశాబ్దాల కెరీర్‌లో నేను అంతర్జాతీయంగా టెలికామ్‌ మొబిలిటీ కంపెనీలతో కలిసి పనిచేశాను. ఫ్లాష్‌గార్డ్‌ వద్ద అద్భుతమైన బృందంలో భాగం కావడం పట్ల ఆనందంగా ఉంది. ఈ బృందంతో నా అనుభవం,విజ్ఞానం పంచుకోనున్నాను. విస్తృతస్ధాయి విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారించడంతో పాటుగా మా నాయకులు, బృందాలు అర్ధవంతమైన వృద్ధిని సాధించడంలో సహాయపడుతూ మార్కెట్‌లో మా బ్రాండ్‌కు తగిన గుర్తింపును తీసుకురానున్నాను’’ అని అన్నారు. బ్రిలియంట్ స్రీన్ ప్రొటెక్టర్‌ కటింగ్‌ మెషీన్‌ ఫ్లాష్‌గార్డ్‌ను ఆవిష్కరించిన మొట్టమొదటి కంపెనీలలో ఫ్లాష్‌ సొల్యూషన్స్‌ ఒకటి. ఏదైనా గాడ్జెట్‌ కోసం ఖచ్చితమైన రక్షకునిగా తయారు చేయడానికి ఎంచుకున్న ఏదైనా మోడల్‌ కోసం ప్రొటెక్టివ్‌ ఫిల్మ్‌ను ఆన్‌ డిమాండ్‌ కట్‌ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.