Mon. Dec 5th, 2022
Vishal-mega-mart
Spread the News

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి ,అక్టోబర్ 23,2022: విజయవాడ లోని విశాల్ మార్ట్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఐదో అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంతలో మార్ట్‌లో పెద్ద మొత్తంలో బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడంతో మంటలు వ్యాపించాయి.

Vishal-mega-mart

అగ్ని ప్రమాదం కారణంగా కలెక్టరేట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో మార్ట్ మూసి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.