Mon. Dec 5th, 2022
death
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,అక్టోబర్ 25, 2022: అక్రమ సంబంధాలు బంధాలను,బంధుత్వాలను తెంచే స్తున్నాయి. ఇల్లీగల్ ఎఫెయిర్ కారణంగా ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తాజాగా భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భర్త, కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డారు. మనస్తాపం చెందిన భర్త కన్నకొడుకుతో సహా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల వద్ద రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నారు.

జిఆర్పిఎస్ఐ భాస్కరరావు తెలిపిన వివరాలు ప్రకారం మైలవరం గ్రామానికి చెందిన తన్నీరు రామారావు(34) మైలవరంలో గత కొంతకాలంగా రేషన్ డీలర్ గా పని చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజుతో మృతుని భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలుసుకున్న రామారావు తన ఏడేళ్ల వయసున్న కొడుకు గోపీనంద్ ను తీసుకొని ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల అప్ లైన్ లో వెళుతున్న గూడ్స్ రైలు కిందపడి ఇద్దరు మృతి చెందారు.

death

దీంతో జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసి మధిర సివిల్ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామ నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.