Thu. Mar 28th, 2024
fake-cirtificates

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,అక్టోబర్ 28,2022: నకిలీ డిగ్రీ, ఎంబీఏ సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి. ఓ ఇంటర్నెట్ సెంటర్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకొన్నారు.

పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణ పరిధిలో నకిలీ డిగ్రీ, ఎంబీఏ సర్టిఫికెట్లు పట్టుకున్నారు పోలీసులు. ఓ ఇంటర్నెట్ సెంటర్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇప్పటికే కొంత మందికి నకిలీ సర్టిఫికెట్లు అమ్మిన మోసగాళ్ళు.

fake-cirtificates

నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కోసం 20 వేలు వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇంటర్నెట్ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇంటర్నెట్ యజమానితో పాటు అతనికి సహకారం అందించిన మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ సర్టిఫికెట్లు ఎంత మందికి అమ్మారు..? వారి జాబితా కోసం పోలీసుల ఆరా….?నకిలీ సర్టిఫికెట్లు కొన్న వారిని కూడా విచారణ చేసేందుకు రంగం సిద్దం చేశారు పోలీసులు. నకిలీ సర్టిఫికెట్ల సూత్రదారి ఎవరు అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఇంటర్నెట్ సెంటర్లో కంప్యూటర్ ,ప్రింటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.