Fri. Mar 29th, 2024
Cops crack down on fake certificates racket

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,నవంబర్ 23,2022:నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల రాకెట్‌ను రాచకొండ పోలీసులు బుధవారం ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు.

వీరి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తదితర నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Fake certificates racket busted by police

అరెస్టయిన వారిని మిర్యాల ఆనంద్ కుమార్ (47), ఎం హేమనాథ్ (35), షేక్ షాహీన్‌లుగా గుర్తించారు.

విద్యార్థుల నుంచి రూ.50 వేల నుంచి 60 వేల వరకు వసూలు చేసి విద్యార్థుల కు అందించిన ఆనంద్‌ కుమార్‌ సర్టిఫికెట్లు సిద్ధం చేసి హేమంత్‌కుమార్‌కు అందించాడని, రాకెట్‌లో హేమంత్‌కు షాహీన్‌ సహకరించాడని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ తెలిపారు.