EVTRIC మోటార్స్ భారతదేశ వ్యాప్తంగా 100 డీలర్‌షిప్ ల మైలురాయిని చేరుకుంది

Automobile Business Featured Posts Technology Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 12, 2022: ఇండియాలో ఎలెక్ట్రిక్ టూ-వీలర్ రంగం,ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్రాండులలో EVTRIC మోటార్స్ ఒకటిగా ఉంది. కంపెనీ కేవలం 6 నెలల అతి తక్కువ కాలంలోనే భారతదేశ వ్యాప్తంగా అద్భుతమైన 100+ డీలర్‌షిప్ మైలురాయిని చేరుకుంది కాబట్టి ఇది సంపూర్ణంగా ఊపులో ఉంది. ఈ సాధన కేవలం అపూర్వమైన ఆదరణను అందుకోవడం మాత్రమే కాకుండా అదే సమయములో తన పోటీదారుల పట్ల ఘనమైన పునాదిరాయిని నెలకొల్పుకొంది.

ప్రస్తుతం EVTRIC స్కూటర్లు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లభిస్తున్నాయి. ఈ బ్రాండు స్థాయి II,స్థాయి III మార్కెట్లలో,దేశం,అత్యంత మారుమూల ప్రాంతాలలో సైతమూ గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. ఇది మెట్రో నగరాలకు అతీతంగా ఆగ్రా, వారణాసి, అలీఘర్, జోధ్‌పూర్, బికనీర్, సూరత్ మొదలగువంటి నగరాలలో కూడా తన ఉనికిని చాటుకుంటోంది.

“కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సమీకృతమైన ఆటోమోటివ్ రంగాన్ని గట్టిగా నిలువరించే బలప్రయోగం చేసినప్పటికీ, మా ఉద్యోగుల నిజాయితీతో కూడిన ప్రయత్నాలతో మా బ్రాండు నెమ్మదిగా దాదాపు ఇండియా లోని ప్రతి ముఖ్యమైన రాష్ట్రం,నగరములో బలమైన నెట్‌వర్క్ ని ఏర్పాటు చేసుకొంది,” అన్నారు EVTRIC మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్,వ్యవస్థాపకులు మనోజ్ పాటిల్ గారు.

ఈ బ్రాండు తన కస్టమర్ల విభిన్న అవసరాలు ,ఆవశ్యకతలకు తగ్గట్టు సౌకర్యంగా ఉండే 7 విభిన్నమైన EV టూ-వీలర్లను చక్కని డిజైన్లు,అద్భుతమైన టెక్నాలజీతో అందజేస్తోంది. ఈ బ్రాండు ఇన్-హౌస్ రోబోటిక్ వెల్డింగ్ చాసిస్ తయారీ, నిర్మాణము ను కలిగి ఉండి, 100% భారత్ లో తయారీ ఉత్పాదన సాధనా మార్గములో పయనిస్తూ ఉన్నందువల్ల EVTRIC స్కూటర్లు వాటి నాణ్యమైన ఉత్పాదన కొరకు కస్టమర్ల విశ్వాసా న్ని చూరగొంటున్నాయి. EVTRIC రైడ్ అనేది ప్రస్తుతం కంపెనీచే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ అయినందువల్ల ఇది కస్టమర్ల మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉంటోంది.

EVTRIC మోటార్స్ అత్యధిక అమ్మకాలు,వాటి విజయగాధకు ప్రస్తుతం మహారాష్ట్ర , కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాలు దోహదపడుతున్నాయి. 2022 సంవత్సరం ఆఖరు నాటికి, తన నిబద్ధతకు ఒక పరీక్షగా EVTRIC మోటార్స్ , 2 వ దశలో తూర్పు,దక్షిణ భారత రాష్ట్రాలలో మరింత విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఇండియా వ్యాప్తంగా తన లక్ష్యాన్ని 110 నుండి 350 డీలర్లకు పెంచుకోవానే ధ్యేయముతో పనిచేస్తోంది.

చమురు ధరల్లో ఒడిదుడుకులు తన మార్కెట్ వాటాకు అదనపు జోడింపును కలిగిస్తుండగా EVTRIC మోటార్స్ తన విస్తృతిని వ్యాప్తి చేసుకుంటోంది. తన ఉత్పత్తులు కేవలం iCAt చే ఆమోదించబడినవి మాత్రమే కాకుండా, కస్టమర్ల దృష్టి అంతా ‘భారత్ లో తయారీ’ పై నిమగ్నమవుతున్న ఈ శకంలో కంపెనీ దానిని నెరవేర్చడానికి వాగ్దానం చేస్తుండడం కంపెనీ కిరీటానికి కలికితురాయిని జోడిస్తున్న మరొక వాస్తవంగా ఉంది.