Fri. Mar 29th, 2024
Earthquake_Turkey365t

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇంటర్నేషనల్ ,ఫిబ్రవరి 7,2023: టర్కీ ,సిరియాలో ఘోరమైన భూకంపాలు ఇప్పటివరకు 4,000 మందికి పైగా మరణించారు. అంతకుముందు రోజు 7.8, 7.6 , 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు టర్కీని తాకాయి.

భూకంప బాధిత టర్కీకి భారతదేశం భూకంప సహాయక సామగ్రిని పంపింది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత, భారత వైమానిక దళానికి చెందిన విమానం ద్వారా భూకంప సహాయక సామగ్రిని భారతదేశం టర్కీకి పంపింది.

భారతదేశం పంపిన రిలీఫ్ కన్సైన్‌మెంట్‌లో స్పెషలిస్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కూడా ఉంది. ఇందులో పురుషులు, మహిళా సిబ్బంది, అత్యంత నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌, వైద్య సామాగ్రి,

Earthquake_Turkey365t

అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, సహాయక చర్యలకు అవసరమైన ఇతర క్లిష్టమైన పరికరాలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.

అంతకుముందు భారత ప్రభుత్వం వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) శోధన, రెస్క్యూ బృందాలు, వైద్య బృందాలు, సహాయక సామగ్రిని భూకంపం దెబ్బతిన్న టర్కీకి పంపాలని నిర్ణయించింది.

బాధిత దేశానికి అన్ని విధాలా సహాయాన్ని అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

100 మంది సభ్యులతో కూడిన రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు శిక్షణ పొందిన కుక్కలు ,అవసరమైన పరికరాలతో భూకంపం ప్రభావిత ప్రాంతానికి శోధన, రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం పంపారు.

అంతేకాకుండా, శిక్షణ పొందిన వైద్యులు, పారా మెడిక్స్‌తో కూడిన బృందాన్ని కూడా అవసరమైన మందులతో పంపించారు.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి, పలువురు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టర్కీలో ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు.

15వేల మందికి పైగా గాయాలు..


టర్కీ, సిరియాలో కనీసం 4000 మంది మరణించగా,15వేలమందికి పైగా గాయపడ్డారు. 10 నగరాల్లో1,700కు పైగా భవనాలు దెబ్బతిన్నాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఫియట్ ఆక్టేను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

అదే సమయంలో, సిరియాలో 783 మంది మరణించగా, 639 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్, లెబనాన్‌లలో కూడా మరణాల సంఖ్య పెరుగుతోంది.