Wed. Mar 27th, 2024
zaney-forma-redyanaik
zaney-forma-redyanaik

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 16,2022: మెగాసిటీ నవకళా వేదిక మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులను గుర్తించి వారి అటువంటి వారిని ప్రతి సంవత్సరం “డా.బి.ఆర్.అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్” తో గౌరవించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా పలువురికి ఆయా పురస్కారాలు అందించారు. రవీంద్రభారతి లో జరిగిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్-2022 ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా జనీ ఫార్మా అధినేత డాక్టర్. రమావత్ రెడ్యానాయక్ కు డా.బి.ఆర్.అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్ అందించారు.

http://www.zaneypharma.in/index.html

ఈ సందర్భంగా వక్తలు రమావత్ రెడ్యానాయక్ అందించిన సేవలను కొనియాడారు. జనీ ఫార్మా అధినేత డాక్టర్. రమావత్ రెడ్యానాయక్ మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం పట్ల సంతోషంగా ఉందని, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నాకు ఎంతోమందికి సేవలందించే అవకాశం కలుగుతోందని, సమాజసేవ చేయడం ద్వారా మనకు జన్మనిచ్చిన భూమి ఋణం తీర్చుకునే అవకాశం లభించిందని ఆయన అన్నారు.

http://www.zaneypharma.in/index.html

zaney-forma-redyanaik

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, మెగాసిటీ నవకళా వేదిక మదర్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మల్లిఖార్జునరావు, టీపీసీసీ లీగల్ కన్వీనర్ శ్రీనివాస చారీ, ప్రముఖ న్యాయవాది మూవీ ఆర్స్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హరనాథ్, కన్సల్టెంట్ ఫిజీషియన్ ఆశిష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.http://www.zaneypharma.in/index.html