Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 10, 2022: డా. అగర్వాల్స్ హెల్త్ కేర్ లి. (డిఎహెచ్‪సిఎల్), అమెరికాలో సారథ్య స్థానంలోవున్న మదుపు సంస్థల్లో ఒకటి, మధ్యతరహా,గ్రోత్ ఈక్విటీ వేదిక, ప్రత్యామ్నాయ సొత్తు సంస్థ అయిన టెక్సాస్ పసిఫిక్ గ్రూప్ – టిపిజి గ్రోత్ నుంచి, సింగపూర్లో ప్రధానకార్యాలయం కలిగివున్న, ప్రస్తుత ప్రపంచవ్యాప్త మదుపుదారైన, టెమాసెక్ నుంచి, రూ. 1,050 కోట్ల నిధులని సేకరించగలిగింది. ప్రస్తుత విడత పెట్టుబడి, నేత్ర సంరక్షణా రంగంలో, భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడి నిధులు, ఇవి కంపెనీ తాలూకు విస్తరణా ప్రణాలికలకి ఊతం ఇచ్చి, ప్రస్తుత మదుపుదారైన ఎడివి పార్ట్నర్స్ నుంచి బయటకు వచ్చే వీలుకల్పిస్తుంది. ఈ కంపెనీ, 2019లో టెమాసెక్ నుంచి రూ. 270 కోట్ల పెట్టుబడి కూడా సేకరించింది.

ఈ సందర్భంగా ప్రొ. (డా.) అమర్ అగర్వాల్, ఛైర్మన్, డా. అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ మాట్లాడుతూ “మా మదుపుదారైన ఎడివి పార్ట్నర్స్ తో గత ఆరు సంవత్సరాలుగా మా ప్రయాణం సజావుగా సాగుతోంది. ఇప్పుడు టిపిజి గ్రోత్, టెమాసెక్ లతో భాగస్వామ్యం కూడి, తరవాత దశ కంపెనీ ఎదుగుదల కోసం చూడ్డానికి మేం చాలా ఉత్సాహపడుతున్నాం. ఈ కొత్త పెట్టుబడులని భారతదేశంలోను, విదేశాల్లోనూ మా ఉనికిని విస్తరించడానికి, సూపర్-స్పెషాలిటీ ఐ కేర్ కోసం అత్యాధునిక సాంకేతికలని అందుబాటులోకి తేడానికి ఉపయోగించడం జరుగుతుంది” అన్నారు.డా. అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా వేగంగా ఎదుగుతోంది, గత ఐదేళ్ళలోనే ఈ నెట్వర్క్ కి కొత్తగా 60 యూనిట్లు జతయ్యేయి. ప్రస్తుతం 105 ఆస్పత్రులతోవున్న నెట్వర్క్ ని రాబోయే 3-4 ఏళ్ళలో 200 ఆస్పత్రులకి పెంచాలన్నది ఈ కంపెనీ ప్రణాళిక. కంపెనీ 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 700 వరకూ ఆదాయం సాధించింది.

అంకుర్ థడాని, మేనేజింగ్ డైరెక్టర్, టిపిజి గ్రోత్, ఈ సందర్భంగా మాట్లాడుతూ “డా. అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ తోను, అనుభవజ్ఞులైన, అసామాన్యమైన యాజమాన్య బృందంతోనూ కలిసి, కంపెనీ విస్తరణకు, ప్రగతి కి, సేవలు మరింత మెరుగుపరచడంకోసం కృషిచేయడానికి ఉత్సాహపడుతున్నాం. టిపిజి ప్రధానంగా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణా రంగం దృష్టిసారిస్తోంది. దృష్టి వైకల్యం చాలా ఎక్కువగా, వైపరీత్యంగా వున్న మార్కెట్లో కీలకమైన నేత్ర సంరక్షణ అందించడాన్ని కొనసాగిస్తూ దేశంలో నెంబర్ వన్ ప్రవేట్ నేత్ర సంరక్షణా గొలుసు సంస్థతో భాగస్వామ్యం కూడినందుకు మేం గర్వపడుతున్నాం” అన్నారు.సురేష్ ప్రభల, కో-ఫౌండర్, మేనేజింగ్ పార్ట్నర్, ఎడివి పార్ట్నర్స్ మాట్లాడుతూ, “డా. అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ తో గత ఆరేళ్ళుగా మా భాగస్వామ్యం గొప్పగా సాగింది. ఇబ్బడిముబ్బడిగా వున్న ప్రగతి అవకాశాల అనుకూలతని అందుకుని, ఈ గ్రూప్ భవిష్యత్ లో ముందడుగేస్తుందని ఆశిస్తున్నాం. ఈగ్రూపుకి, దాని మేనేజిమెంట్ విజయం సాధించాలని ఆశిస్తున్నాం” అన్నారు.

డా. ఆదిల్ అగర్వాల్, సిఇఒ, డా. అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్, మాట్లాడుతూ “ఎడివి పార్ట్నర్స్ తో మా ప్రయాణం అద్బుతంగా సాగింది, మా దృక్పథంలో వారు నమ్మకముంచినందుకు కృతజ్ఞతలు. మరోసారి టెమాసెక్ తో భాగస్వామ్యం కూడుతున్నందుకు మేం చాలా ఉత్పాహపడుతున్నాం, టిపిజి గ్రోత్ బృందంతో కొత్త ప్రయాణం ఒక ముందడుగవుతుందని ఆశిస్తున్నాం. ఈ రెండు గ్రూపులకికూడా ఆరోగ్య సంరక్షణా రంగంలో గణనీయమైన అనుభవం వుంది. మా సంస్థని మరో స్థాయికి తీసుకెళ్ళడానికి వారి అనుభవం దోహదపడుతుందని ఆశిస్తున్నాం. ఈ కొత్త పెట్టుబడులు మా నెట్వర్క్ ని రాబోయే మూడేళ్ళలో రెండింతలు చేయడానికి దాహదం చేస్తాయి, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, కర్నాటక, ఆంధ్ర, తెలంగాణలో కీలక మార్కెట్లలో అక్విసిషన్స్ కి కూడా ప్రయత్నించబోతున్నాం. అంతేకాక, దేశవ్యాప్తంగా వేగంగా మా నెట్వర్క్ ని హరితక్షేత్ర విస్తరణ దిశగా నడిపిస్తాం. అలాగే ఆఫ్రికా మాకు ఇంకో ముఖ్యమైన భౌగోళిక ప్రాంతం, అక్కడ ప్రస్తుతం మాకు 15 ఆస్పత్రుల నెట్వర్క్ వుంది. కెన్యా, మొజాంబిక్, టాంజానియా, ఘనా వంటి దేశాల్లో మా ఉనికిని ఇంకా బలోపేతం చేసుకుంటాం” అని వివరించేరు.

కంపెనీకి సంబంధించి ఈ లావాదేవీలకు, వేదా కార్పరేట్ అడ్వైజర్స్, అవెండస్ కాపిటల్ సంస్థలు ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా వ్యవహరిస్తారు.డా. అగర్వాల్ ఐ హాస్పిటల్స్ కి భారతదేశ వ్యాప్తంగాను, ఆఫ్రికాలోను మొత్తం 105 ఆస్పత్రుల నెట్వర్క్ వుంది. భారతదేశంలో 12 రాష్ట్రాల్లోను, 11 దేశాల్లోనూ ఈ గ్రూపు ఉనికి కలిగివుంది. ఈ కేంద్రాల్లో 400 మంది ఆఫ్తాల్మొలజిస్ట్ లు, 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ వాళ్ళు కోటీ 20 లక్షల మంది రోగులకి చికిత్స చేసేరు, వీరు కేవలం నేత్ర సంరక్షణని అందించడం మాత్రమేకాక, ఆప్తాల్మొలజీ, దాని సంబంధ రంగాల్లో విద్యావిషయక, పరిశోధనాకార్యక్రమాలని కూడా నిర్వహిస్తున్నారు.