Wed. May 31st, 2023
Doctors & Hospital Staff Vaccinated with Covishield at Apollo Spectra Hospital Kondapur, Hyderabad
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,  ఫిబ్రవరి10, 2021 ః అపోలో స్పెకా్ట్ర హాస్పిటల్‌ కొండాపూర్‌ వద్ద కోవిడ్‌ –19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను తమ డాక్టర్లు,సిబ్బంది కోసం నిర్వహించారు. ఈ సర్జరీ స్పెషాలిటీ ఆస్పత్రిలో జనరల్‌,ఆర్థోపెడిక్‌,ఈఎన్‌టీ,  యూరాలజీతో పాటుగా మరెన్నో విభాగాలలో శస్త్రచికిత్సలను చేస్తారు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా మొత్తంమ్మీద 123 మంది డాక్టర్లు,హెల్త్‌కేర్‌ వర్కర్లుకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందించారు.

Doctors & Hospital Staff Vaccinated with Covishield at Apollo Spectra Hospital Kondapur, Hyderabad
Doctors & Hospital Staff Vaccinated with Covishield at Apollo Spectra Hospital Kondapur, Hyderabad

అన్ని భద్రతా మార్గదర్శకాలనూ పరిగణలోకి తీసుకున్న అపోలో స్పెకా్ట్ర, ఆస్పత్రిని సందర్శించే రోగుల కోసం పూర్తి భద్రతా చర్యలను చేపట్టింది. ఇప్పుడు మరోమారు వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ద్వారా నూతన వ్యాక్సిన్‌ పట్ల ఉన్న అపోహలను, అనుమానాలను సైతం పటాపంచలు చేసింది.