Sat. Apr 20th, 2024
lalu-prasad

నిప్పుల కొలిమిలో కాలిన ఇనుములా ఎన్నో బాధలు పడ్డాడు..
వందలాది దెబ్బలు తిన్న శిలలా ఎంతో వ్యధను అనుభవించాడు.. చివరికి తన గమ్యాన్ని చేరుకున్నాడు. మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టిన అతనికి సామాన్యులు పడే బాధలను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశాడు. వారి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బెటర్ అని ఆలోచించాడు.

సామాన్యుడికి విద్య ద్వారానే విలువ పెరుగుతుందని గ్రహించి డాక్టర్ చదువు పట్ల ఆకర్షితుడై.. తాను డాక్టర్ అయితే ఎంతోమందికి సేవ చేయవచ్చనే కృతనిశ్చయంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ)గా బాధ్యతలు చేపట్టాడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్.

డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ వనపర్తి జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా 365తెలుగు డాట్ కామ్ న్యూస్ వెబ్ పోర్టల్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

అలా మొదలై..డీఎంహెచ్ఓ గా..

డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ 2001లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. డాక్టర్ పట్టా పొందారు. వనపర్తి జిల్లాలో వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు వైద్యుడిగా మూడేళ్లపాటు సేవలందించారు. డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ 2005లో మహబూబ్నగర్ జిల్లా పెద్దమందడి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. 2009లో చిన్నపిల్లల వైద్యనిపుణులు గా ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత డిప్యూటీ సివిల్ సర్జన్ గా నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగంలో సేవలు అందించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర..

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ నేత ఇప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పిలుపుతో తెలంగాణ ఉద్యమంలో వైద్యులను భాగస్వాములు చేస్తూ తనవంతు పాత్ర పోషించారు. ప్రభుత్వ వైద్యులను ఆరోగ్య కార్యకర్తలను, ఇతర ఆరోగ్య సిబ్బందిలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపారు.

Appointment of Dr. Lalu Prasad Rathore as Medical and Health Officer of Vanaparthi District

కెసిఆర్ సార్ పిలుపు మేరకు తన సహచరులను వివిధ జిల్లాల నుంచి అప్పటి ప్రతి ఉద్యమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. తెలంగాణ ఉద్యమం రావాలని ఎన్నో కలలుగని ఉన్నత విద్యావంతులు మేధావులు ఉద్యమంలో ఉండాలని వారితో కలిసి అడుగులో అడుగు వేసి ఆరోగ్య తెలంగాణని ఆరోజే ఊహించి తమ ప్రియతమ నేత హరీష్ రావు గారితో కలిసి నడిచారు.

Appointment of Dr. Lalu Prasad Rathore

ప్రస్తుత డీ.ఎమ్.ఈ డాక్టర్ రమేష్ రెడ్డి, డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ నరహరి, డాక్టర్ సిద్దిపేట రమేష్, డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , లాంటి నేతలతో ప్రయాణం చేస్తూ తెలంగాణ సాధనకు తన వంతుగా కృషి చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లలో కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు లాలూ ప్రసాద్ రా థోడ్ .

Dr.Laluprasad-rathod

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కార్యోన్మకులయ్యారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చి సాధారణ వ్యక్తిలా పాలమూరు జిల్లాకు చెందిన ఒక తండా నుంచి ప్రస్థానం ప్రారంభించి ఈనాడు అదే జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు లాలూ ప్రసాద్ రా థోడ్.