Thu. Apr 25th, 2024
snail-glue

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 19,2022: సబ్బుల తయారీలో అనేకరకాల ఇంగ్రీడియంట్స్ వాడుతుంటారు. నత్తల జిగురుతో సబ్బుల తయారుచేయడం అనేది ఇప్పుడు ఫ్రాన్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.

వీటిని వాడితే రకరకాల చర్మ రోగాలు దూర‌మవుతాయ‌ట‌. అంతేకాదు ముసలితనం మన దరిచేరకుండా ఉంచడంలో నత్తల జిగురుతో చేసిన సబ్బులు అద్భుతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకలు తేల్చారు.

ఈ సబ్బులతో చాలా ఉపయోగాలు ఉన్నట్లు తేలడంతో వాటికి ఫ్రాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొలస్కా జాతికి చెందిన జీవుల్లో నత్త కూడా ఒకటి.

నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివాసముంటాయి. చాలా నత్తలు శాకాహారులు…కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు.

snail-glue

నత్తలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తమను తామే బాగుచేసుకుంటాయి. ఇప్పటికే నత్తల పై పలుపరిశోధనలు జరిగాయి. నత్తలు ఓ రకమైన జిగురు పదార్థాన్ని (బురద) స్రవిస్తూ ఉంటాయి.

నత్తల నుంచి ఆ జిగురు పదార్థాన్ని సేకరించిన ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులు.దీనిపై లోతైన పరిశోధనలు జరిపారు. 2020లో ఫ్రాన్స్‌లో 60,000 నత్తల నుంచి బురదను సేకరించి.. వాటితో సబ్బులు తయారీ చేశారు.

40 నత్తల నుంచి సేకరించిన బురదతో ఓ సబ్బు తయారు చేయగలిగారు. నత్త బురదలో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే పదార్థాలున్నాయి.

నత్తల జిగురు మానవ శరీరంపై గాయాలను నయం చేయగలుగుతున్నాయి. చర్మ కణాలను కొల్లాజెన్ రిపేర్ చేస్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

అలాగే ఈ నత్తల జిగురుతో చేసిన సబ్బులు…ముసలితనం రాకుండా ఆపగలవని వారు తేల్చారు.

snail-glue

చర్మానికి వచ్చే రకరకాల వ్యాధుల్ని పోగొట్టే శక్తి వీటికి ఉంటుందన్నారు నిపుణులు. ఫలితంగా నత్త సబ్బులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది.

ఫ్రాన్స్‌లో డామిన్ డెస్రోచెర్ అనే సైంటిస్ట్ నత్తలను ఫాంలో పెంచుతున్నారు. నత్తల జిగురుతో కాస్మెటిక్ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.

ప్రస్తుతం 60 వేల నత్తలను పెంచుతున్న డెస్రోచెర..వాటి నుంచి జిగురు పదార్థం సేకరించి సబ్బులు తయారుచేసి విక్రయిస్తున్నారు.

దీంతో నత్తల జిగురు పై కాస్మెటిక్ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఈ జిగురుతో ముసలితనం రాకుండా చేయగలిగితే డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశముంది.

నత్త జిగురుతో చేసిన సబ్బుల ఉపయోగంపై ఫ్రాన్స్ లో మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.