Fri. Mar 29th, 2024
Delhi Public School

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే15,2023: ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 10వ, 12వ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను నాచారం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అభినందిస్తోంది. అలాగే ఇంత గొప్ప విజయం సాధించినందుకు గర్వంగా ఉందని స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు.

‘‘విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చక్కటి ప్రమాణాలతో విద్యను మా స్కూల్ ఉపాధ్యాయులు అందించడంవల్లే ఇంతటి గొప్ప ఫలితాలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా తమ స్కూల్ స్టాండర్డ్స్ ఇలాగే కొనసాగుతాయ’’ని ఆయన అన్నారు.

అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతారావు మాట్లాడుతూ, ‘‘విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం. అందుకే వాళ్లకెప్పుడూ మేము అండగా ఉంటాం. మా పిల్లలు మంచి పర్సటేజీలు సాధించడం మాకెంతో గర్వంగా ఉంద’’ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పదో తరగతి విషయానికొస్తే, నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులైన ప్రణవ్ చౌరాసియా (596/600 – 99.3%)తో మొదటి స్థానంలో, సత్యార్థ్ శివకుమార్ అయ్యర్ (593/600-98.8%)తో ద్వితీయ స్థానంలో, గోటూరి షణ్ముఖ శ్రీహర్ష (592/600-98.7%)తో తృతీయ స్థానంలో, చంద్రిక శ్రీష్ నారాయణ్ (591/600-98.5%)తో నాలుగో స్థానంలో, హర్షవర్ధన్ రవిచందర్ (590/600-98.3%)తో ఐదవ స్థానంలో నిలిచారు.

అలాగే డీపీఎస్ లోని 98 మంది విద్యార్థులు 95% , అంతకంటే ఎక్కువ, 231 మంది విద్యార్థులు 90% ఆపైన మార్కులు సాధించారు. 445 మంది విద్యార్థులు 80% ఆపైన మార్కులు సాధించారు, 573 మంది 70% ఆపైన మార్కులు సాధించారు.

మొత్తం 663 మంది విద్యార్థులు (100%) 60% , అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, ఐటీలో 79 మంది విద్యార్థులు, హిందీలో అత్యధికంగా 99 మంది విద్యార్థులు సెంటమ్‌లు సాధించారు.

ఇప్పుడు 12వ తరగతి విషయానికొస్తే, ఈ స్కూల్ నుంచి కామర్స్ లో 98.4% తో సంక భావన, సైన్స్ లో 97.2% తో ఆంతారా అగర్వాల్, హ్యుమానిటీస్ లో 96.4% తో ఆర్యన్ కుమార్ సాహు టాపర్స్ గా నిలిచారు. మొత్తం 19 మంది విద్యార్థులు 95% అంతకంటే ఎక్కువ, 87 మంది విద్యార్థులు 90% ఆపైన మార్కులు సాధించారు.

246 మంది విద్యార్థులు 80% ఆపైన మార్కులు సాధించారు. 398 మంది 70% ఆపైన మార్కులు సాధించారు. మొత్తం 470 మంది విద్యార్థులు (100%) 60%,అంతకంటే ఎక్కువ స్కోర్ చేశారు. 20 మంది విద్యార్థులు సెంటమ్‌లు సాధించారు.

Delhi Public School

ఫ్యాషన్ స్టడీస్, కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్, బయాలజీ, సైకాలజీ, బిజినెస్ స్టడీస్, లీగల్ స్టడీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పెయింటింగ్ సబ్జెక్టులలో జాతీయ ర్యాంకులు సాధించారు విద్యార్థులు.

మిగిలిన ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్,ఎకనామిక్స్, అకౌంటెన్సీ, హిస్టరీ, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎన్‌సీసీలో 99 మంది అత్యధిక మార్కులు సాధించారు.

ఈ సంవత్సరం విద్యార్థులు ఎఫ్‌ఎంఎం, మాస్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యోగా ఇసిసిఇ మొదలైన కొత్త ఐదు సబ్జెక్టులైన ఒకేషనల్ స్కిల్స్ పరీక్షకు ఈ సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 2 సెంటమ్‌లు, మిగిలిన సబ్జెక్ట్‌లలో అత్యధికంగా 98తో అద్భుతమైన పనితీరు కనబరిచారు. పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, డైరెక్టర్ పల్లవి, సీఓఓ యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ ఎస్. సునీతా రావు, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ నందితా సుంకర, ఉపాధ్యాయుల దూరదృష్టే ఈ సంవత్సరం అత్యద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు తోడ్పడింది.