Fri. Mar 29th, 2024
PAN_AAdhar_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 28, 2023: పాన్‌ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి గడువు మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించారు. మీరు జూన్ 30తేదీ లోపు చేయకపోతే. మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. ఈ పరిస్థితిలో, మీరు పాన్ కార్డుకు సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రయోజనాలను పొందలేరు.

ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం నుంచి పెద్ద లావాదేవీలు చేయడం వరకు, పాన్ కార్డ్ పనిచేయకపోతే చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతే కాకుండా, మీరు స్టాక్ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెట్టలేరు. ఇప్పుడు మీకు జూన్ 30 వరకు ఒకే ఒక అవకాశం ఉంది. మీరు వీలైనంత త్వరగా పాన్‌ కార్డు తో ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.

PAN_AAdhar_

మీ పాన్‌కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి, ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ని సందర్శించాలి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత లింక్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీరు పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
తదుపరి దశలో, ధృవీకరించు ఎంపికను ఎంచుకోండి.
మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి,మీరు E-Pay Tax ద్వారా చెల్లించడం కొనసాగించు ఎంపికను ఎంచుకోవాలి.

PAN_AAdhar_

దీని తర్వాత మీరు మీ పాన్ అండ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
తదుపరి దశలో, మీరు మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.

ఓటీపీ ధృవీకరణ తర్వాత, మీరు e-Pay Tax పేజీకి దారి మళ్లించబడతారు. ఇక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ప్రొసీడ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

తదుపరి దశలో, మీరు అసెస్‌మెంట్ సంవత్సరంలో 2023-24ని ఎంచుకోవాలి, చెల్లింపు రకంలో ఇతర రసీదు (500)ని ఎంచుకోవడం ద్వారా రూ. 1,000 చెల్లించాలి. చెల్లింపు చేసిన తర్వాత, మీ పాన్ కార్డ్ ఆధార్‌తో లింక్ చేఅవుతుంది.