Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 12, 2022: భారతదేశపు ప్రముఖ సిమెంట్‌ కంపెనీ దాల్మియా సిమెంట్ లిమిటెడ్ అనుబంధం సంస్థ దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ తన దాల్మియా సిమెంట్‌ రిటైల్‌ బ్రాండ్స్‌ అన్నింటిపై కస్టమర్‌ ఆఫర్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని తన సిమెంట్‌ తయారీ కేంద్రం ద్వారా ఈ సంస్థ ఇప్పటికే ~800 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించింది. 2030 నాటికి RE100, 2040 నాటికి కార్బన్‌ నెగిటివ్‌ లక్ష్యసాధనలో సుస్థిరత నిబద్ధత చర్యల్లో భాగంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో 25 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పింది.

తన పెట్టుబడి ద్వారా నైపుణ్య సృష్టి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, సుస్థిరత, పర్యావరణ నిర్వహణలో కంపెనీ మరింత విలువను జోడిస్తోంది. రాష్ట్రం నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో దాదాపు 11000+ తో బలంగా ఉన్న తన విస్తృతస్థాయి డీలర్, సబ్-డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో చేపడుతున్న గన్నవరం విమానాశ్రయం, ఇస్రో శ్రీహరికోట, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు డీసీబీఎల్‌ గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ నిర్మాణంలో కంపెనీ నిబద్ధత గురించి వ్యాఖ్యానిస్తూ డీసీబీఎల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ సంజయ్ వాలి, “పారిశ్రామిక, మౌలిక సదుపాయాల పురోగతిలో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని మాకు కల్పించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరిన్ని పెట్టుబడులు పెడుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామిగా నిలుస్తాం. మా పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కడపలో మేము చేపడుతున్న సామాజిక మార్పు చర్యలు ఒక పురోగామి, స్వయం సుస్థిర పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో సాయపడుతుందని భావిస్తున్నాం” అని అన్నారు.

దక్షిణ ప్రాంతంలో పెరుగుతున్న కస్టమర్ల కోసం దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్ అద్భుతమైన కొత్త ఆఫర్స్ కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు ఇప్పుడు ‘ఎవ్రీ హోమ్ హ్యాపీ ఆఫర్’ ప్రత్యేక డీల్‌ పొందవచ్చు. శక్తి, మన్నిక, పర్యావరణ అనుకూలమైన అన్ని రిటైల్ ‘దాల్మియా సిమెంట్’ బ్రాండ్స్‌కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఈ ఆఫర్‌ గురించి డీసీబీఎల్‌ సౌత్‌ రీజినల్‌ డైరెక్టర్‌ శ్రీ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ “దక్షిణ భారతదేశంలోని మా కస్టమర్లు వారి నిర్మాణ అవసరాల కోసం అది వాణిజ్యపరమైనది కావచ్చు లేదా వ్యక్తిగతగమైనది కావచ్చు పునాదులను బలంగా నిలపడమే కాకుండా భవిష్యత్‌ తరాలకు సుస్థిర పర్యావరణాన్ని అందించేందుకు నిర్మాణ పరిష్కారాలు కోరుకుంటున్నారు. మా ఆఫర్లపై నమ్మకం ఉంచి ఈ ప్రాంతంలో మా ఉనికిని బలోపేతం చేయడంలో సహకారం అందిస్తున్న మా వ్యక్తిగత గృహనిర్మాణదారుల కోసం ఈ ఆఫర్‌ను మేము ప్రవేశపెట్టాం” అని తెలిపారు.

ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ అవకాశాలను సమ్మిళితం చేస్తూ వేగవంతమైన ప్రగతి మార్గంలో దాల్మియా సిమెంట్‌ (భారత్‌) ప్రయాణిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పెట్టుబడుల ద్వారా తన కార్యాకలాపాలు విస్తరించుకుంటూ ప్రస్తుత మార్కెట్‌లో తన స్థానాన్ని కంపెనీ సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది.

‘ఎవ్రీ హోమ్ హ్యాపీ ఆఫర్’కు సంబంధించిన మరిన్ని వివరాలు www.dalmiadspoffer.comలో అందుబాటులో ఉన్నాయి. దాల్మియా సిమెంట్ ప్రతినిధులు వారి రివార్డుల గురించి విజేతలకు తెలియజేస్తారు!