Sat. Jun 10th, 2023
Cyient and eolos Partner to Launch “Design for Circularity” Consulting and Engineering Practice
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఫిబ్రవరి 11,2021 ః అంతర్జాతీయ ఇంజినీరింగ్‌,తయారీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేఫన్‌, సాంకేతిక పరిష్కారాల కంపెనీ సైయెంట్‌ నేడు తాము బెర్లిన్‌ కేంద్రంగా కలిగిన పారిశ్రామిక కన్సల్టెన్సీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్ధ ఇయోలోస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. వ్యాపార సంస్థలు సుస్థిరమైన, సర్క్యులర్‌ ఎకనమీ దిశగా మారేందుకు ఇయోలోస్‌ తోడ్పడుతుంది. పరిశ్రమలు అత్యుత్తమ సుస్థిరత వైపు మారడానికి మద్దతునందించేలా ఓ ఇంజినీరింగ్‌ ప్రాక్టీస్‌ను సైయెంట్, ఇయోలోస్‌లు సహ అభివృద్ధి చేయనున్నాయి.ఈ భాగస్వామ్యం గురించి కార్తికేయన్‌ నటరాజన్‌, అధ్యక్షుడు,చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, సైయెంట్‌ మాట్లాడుతూ ‘‘ వాతావరణ మార్పులు ,డీ–కార్బనైజేషన్‌కు మనం ఏ విధంగా స్పందిస్తామనేది భావితరాల కోసం మన వారసత్వంను నిర్వచిస్తుంది. ఇయోలోస్‌ , పారిశ్రామిక అనుభవం,సర్క్యులర్‌ ఎకనమీలో వారి నైపుణ్యంతో ఇంజినీరింగ్‌ డిజైన్‌, తయారీ, మార్కెట్‌లో సైయెంట్‌ నాయకత్వం కలిసి వినియోగదారుల అవసరాలను తీర్చనున్నాయి..’’ అని అన్నారు.

Cyient and eolos Partner to Launch “Design for Circularity” Consulting and Engineering Practice
Cyient and eolos Partner to Launch “Design for Circularity” Consulting and Engineering Practice

‘‘సైయెంట్‌తో తమ భాగస్వామ్యం పర్యావరణ ప్రభావం తగ్గించేందుకు చేస్తోన్న ప్రయత్నాలలో  ఉత్పత్తి డిజైన్‌ కంపెనీ ప్రక్రియలను మెరుగుపరచడంతో పాటుగా విస్తృతశ్రేణి ఇంజినీరింగ్‌ సామర్థ్యాల పరంగా తమ అనుభవాన్ని పూరిస్తుంది’’ అని ఇయోలోస్‌ సీఈవో అండ్‌ కో–ఫౌండర్‌ పియార్రీ–వెస్‌ కోహెన్‌ అన్నారు.