Thu. Apr 18th, 2024
Creating awareness among farmers for Nutri Cereals (Millets)
Creating awareness among farmers for Nutri Cereals (Millets)

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఆగస్టు 4, ఢిల్లీ,2021: రాగి, జొన్న, బజ్రా వంటి చిరు ధాన్యాల (మిల్లెట్స్) పోషక విలువలపై ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్  సబ్ మిషన్ కిందప్రదర్శన , శిక్షణ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. తృణధాన్యాల పంటల సాగు , పంటల రక్షణ, పంటల విధానం, నూతన/ హైబ్రిడ్ వంగడాలు పంపిణీ, పోషక విలువలు, చీడ పురుగుల నివారణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద ప్రోత్సాహకాలను అందించడం జరుగుతోంది.

Creating awareness among farmers for Nutri Cereals (Millets)
Creating awareness among farmers for Nutri Cereals (Millets)

 వ్యవసాయ పనిముట్లు/ పనిముట్లు/ వనరుల పరిరక్షణ యంత్రాలు, నీటి పొదుపు పరికరాలు, పంటల సాగు సమయంలో శిక్షణల ద్వారా రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం ప్రదర్శనలు / వర్క్‌షాప్‌లు, సీడ్ మినికిట్‌ల పంపిణీ, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పించడం జరుగుతున్నది. పోషక తృణధాన్యాల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయడం, నైపుణ్య కేంద్రాలను నెలకొల్పడం,  తృణధాన్యాల విత్తనాల కేంద్రాలను నెలకొల్పడం లాంటి కార్యక్రమాలు కూడాజాతీయ ఆహార భద్రతా మిషన్  కింద అమలు జరుగుతున్నాయి. 

Creating awareness among farmers for Nutri Cereals (Millets)
Creating awareness among farmers for Nutri Cereals (Millets)

కేంద్ర పథకంగా అమలు జరుగుతున్న విస్తరణ కార్యక్రమాల పథకం కింద రైతులకు శిక్షణ, సందర్శనలు, ప్రదర్శనలు, రైతులతో చర్చలు, శాస్త్రవేత్తలతో రైతుల సమావేశాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి అవార్డ్ / ప్రగతిశీల రైతులు సభ్యులుగా వ్యవసాయ అవగాహనా శిబిరాల నిర్వహణ లాంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందుతున్నది.రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద రాష్ట్రాలు తృణధాన్యాల సాగును ప్రోత్సహించవచ్చును. ఈశాన్య ప్రాంతాల్లో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. 

ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నూతన చిరు ధాన్యాల వంగడాలు/ సంకరజాతి విత్తనాలను  అభివృద్ధి చేయడానికి   రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కేంద్రాల్లో పనిచేస్తున్న 45 యూనిట్లకు సహకారం అందిస్తున్నది.