Fri. Mar 29th, 2024
Naval Goel CEO & Founder of PolicyX

ఢిల్లీ : కరోనా మహామమారి ప్రజల ఆరోగ్యం, ఆదాయల పైనే కాదు.. బీమా రంగం పై కూడా తీవ్ర ప్రతి కూలప్రభావాన్ని చూపిస్తున్నది. ఫిబ్రవరి 2020 వరకు బీమా రంగం పరిస్థితి బాగానే ఉంది. 2019-20 ఆర్థిక సంవ త్సరం లో ఫిబ్రవరి వరకు ఆరోగ్యేతర బీమా విభాగంలో 13 శాతం వృద్ధి, జీవిత బీమా విభాగంలో 18 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత బీమా రంగం పై కోవిడ్ -19 ప్రభావం తీవ్రంగా పడింది. కరోనాతో ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కొత్తగా బీమా తీసుకొనే వినియోగదారుల సంఖ్య భారీగా పడిపోయింది. మరో వైపు అప్పటికే బీమా కలిగి ఉన్న వారు కూడా పాలసీ రెన్యూవల్ వాయిదావేస్తూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చుస్తే దాదాపు రెండు, మూడేండ్ల వరకు బీమా సంస్థలు కేవలం క్లైమ్స్ పైనే దృష్టిసారించే పరిస్థితులే కనబడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాహన బీమా రంగం
పై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపింది. కొత్త వాహన విక్రయాలు తగ్గడంతో 2019-20 ఆర్ధిక సంవత్సరం నుంచే వాహన బీమా వృద్ధి కొంత మేర మందగమనం లో ఉన్నది. అప్పుడు రెన్యువల్స్ భారీగా ఉండడంతో ఈ ప్రభావం అంతగా వాహన బీమా రంగం పై అంతగా కనిపించలేదు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో వాహనాల అమ్మకాలు పూర్తిగా తగ్గాయి. దీంతో వాహన బీమారంగం మరింత నష్టాలు ఎదుర్కోవల్సి వస్తున్నది. ప్రస్తుతం వాహనాల అమ్మకాలు ప్రారంభమైనా… అవి అంతంత మాత్రమే… ప్రస్తుతం రెన్యువల్స్ ఆగడమే వాహన బీమా సంస్థల నష్టాలకు ప్రధాన కారణం. కరోనా కట్టడిలోభాగంగా విధించిన లాక్ డౌన్ తో వాహనాలు బయట తిరగడం తగ్గిపోయింది. దీని వల్ల ప్రమాదాలు తగ్గి… క్లెయిమ్ ల శాతం కూడా భారీగా తగ్గింది. ఇది వాహన బీమా సంస్థలకు కొంత ఊరట కలిగించే అంశం. అయితే ప్రస్తుతం క్లెయిమ్ పద్దతి కూడా కష్టంగా మారడంతో వినియోగదారులు వాహన బీమా పాలసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కొత్త బీమా పాలసీల కొనుగోలు లేకపోయినా … కొత్త క్లైమ్స్ తక్కువగా ఉండడంతో మోటారు వాహన బీమా రంగం ఇప్పుడిప్పుడే కోలుకుతున్నది. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం అత్యవసరం దీంతో రాబోయే కాలంలో ప్రయివేటు వాహన విక్రయాలు పెరిగి , పాలసీ కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా, కొత్త వాహనాలతో పాటు పాత ద్విచక్ర వాహనాలు, కార్ల కు భారీగానే డిమాండు నెలకొని ఉన్నది. ఇది వాహన బీమా రంగానికి కలిసి వచ్చే అంశమని పాలసీ ఎక్స్ సీఈవో నవల్ గోయల్ తెలిపారు.