Thu. Jun 8th, 2023
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే5,2023: వేసవిలో చల్లని ప్రదేశాలను సందర్శించాలని అందరికీ ఉంటుంది. అయితే కూల్ గా ఉండే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే..? వేసవిలో సెలవులు గడపడానికి ప్రజలు తరచుగా చల్లని ప్రదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. మనదేశంలోనే చల్లని, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు కుటుంబంతో గడపడానికి కూడా ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు. అవేంటంటే..?

కాశ్మీర్ : చాలా ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్. మీరు వేసవిలో ఇక్కడకు వెళ్ళవచ్చు. మొఘల్ గార్డెన్, తులిప్ గార్డెన్ వంటి అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ షికారా రైడ్‌ని ఆస్వాదించవచ్చు. ఇక్కడి పచ్చికభూములు, ఎత్తైన దేవదారు చెట్ల అందాలు మీ మనసును దోచుకుంటాయి.

సిక్కిం: మీరు పచ్చని లోయలు, సరస్సుల అందాలను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు ట్రెక్కింగ్ చేయవచ్చు. ఈ ప్రదేశం ఫ్యామిలీ ట్రిప్‌కి చాలా బాగుంటుంది. ఇక్కడి అందమైన లోయలు మనసును ఎంతగానో ఆస్వాదిస్తారు.

లడఖ్ :అడ్వెంచర్ యాక్టివిటీలను ఇష్టపడే వ్యక్తులు బైక్‌పై ఇక్కడకు వెళ్లవచ్చు. ఈ ప్రదేశంలో నిజంగా భిన్నమైన అనుభవం కనిపిస్తుంది. లోయలు, సరస్సులు, పర్వతాలు , బౌద్ధ విహారాల అందాలు మీ మనసును కట్టిపడేస్తాయి.

కూర్గ్:కర్ణాటకలో అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ కూర్గ్ కూడా ఉంది. కూర్గ్‌లోని పచ్చని దృశ్యాలు, చల్లని వాతావరణం మీకు నచ్చుతాయి. మీరు ఇక్కడ ట్రెక్కింగ్ తోపాటు పక్షులను చూసి ఆనందించవచ్చు.