Thu. Apr 18th, 2024
Consumer Usage of Digital Banking and Contactless Payments Surges in India During Pandemic, New FIS Survey finds

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11,2020 కోవిడ్‌–19 మమహ్మారి వేళ కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవడం పెరిగింది. భారతీయ వినియోగదారులు ఇప్పుడు నగదు వినియోగం
బదులుగా డిజిటల్‌,కాంటాక్ట్‌ రహిత చెల్లింపు అనుభవాలను కోరుకుంటున్నారు. ఈ అంశాలను
అంతర్జాతీయంగా అగ్రగామి ఆర్థిక సేవల సాంకేతిక కంపెనీ ఎఫ్‌ఐఎస్‌ నూతన అధ్యయనంలో వెల్లడించింది.వినియోగదారుల ప్రవర్తన పరంగా సమూలమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడ, ఎలా వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు, లావాదేవీలు నిర్వహిస్తున్నారు, కొనుగోళ్లు ,చేస్తున్నారనేది అత్యంత ముఖ్యమైంది.ఎఫ్‌ఐఎస్‌ పేస్‌ పల్స్‌ సర్వే 2020 కనుగొన్న దాని ప్రకారం, కోవిడ్‌–19 మహమ్మారి వేళ భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. ఈ ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, 68% మంది భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ను ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు.అంతేకాదు,మహమ్మారి తరువాత కూడా51%మందిఈ,చెల్లింపువిధానాన్నికొనసాగించనున్నారు. దాదాపు సగం (48%)మంది స్పందనదారులు తాము కోవిడ్‌–19 అనంతర ప్రపంచంలో కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులను చేయనున్నామని వెల్లడించారు.

Consumer Usage of Digital Banking and Contactless Payments Surges in India During Pandemic, New FIS Survey finds
Consumer Usage of Digital Banking and Contactless Payments Surges in India During Pandemic, New FIS Survey finds

అదనంగా ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం యువ , సీనియర్‌ జెన్‌ వై (24–39 సంవత్సరాలు) వినియోగదారులు ఈ మార్పులను స్వీకరించడంలో ముందున్నారు. ఇతర వయసుల వారితో పోలిస్తే వీరు అధికంగా ఈ తరహా లావాదేవీలను నిర్వహిస్తున్నారు.
‘‘చెల్లింపుల పరంగా సమూలమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వినియోగదారులు మరింత వేగంగా కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు వైపు మళ్లుతుండడం చేత ఆవిష్కరణ వృద్ధికి అవకాశాలు సైతం పెరిగాయి’’ అని మహేష్‌ రామమూర్తి, మేనేజింగ్‌ డైరెక్టర్‌–ఎఫ్‌ఐఎస్‌ అన్నారు. ‘‘అంతేనా, ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం ఈ నూతన అలవాట్లు శాశ్వతంగా ఉండవచ్చు ,కోవిడ్‌ అనంతర ప్రపంచంలో కొనసాగవచ్చు. ఈవినియోగదారులకు సేవలనందించే ఆర్ధిక సంస్థలు , వ్యాపారులకు ఈ ధోరణులు మారుతున్న
వినియోగదారుల అవసరాలకనుగుణంగా సేవలను రూపొందించే అవకాశం అందిస్తాయి’’ అని అన్నారు
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో మొబైల్‌ చెల్లింపులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఈసంవత్సరం మే నెలలో మొత్తంమ్మీద డిజిటల్‌ వాలెట్‌ చెల్లింపులు రెట్టింపయి 253.2 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి2020లో అవి 124.3 కోట్లగా ఉన్నాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్‌ వాలెట్‌ల ద్వారా చేసిన లావాదేవీల విలువ మొత్తం మరింత వేగవంతం అయి 11,080 కోట్ల రూపాయలుగా మే నెలలో చేరాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అది 2,836 కోట్ల రూపాయలుగా ఉంది. కోవిడ్‌–19 మహమ్మారి భారతదేశంలో ప్రజల వ్యక్తిగత సంపాదనపై గణనీయంగా ప్రభావం చూపింది అని ఎఫ్‌ఐఎస్‌ అధ్యయనం వెల్లడించింది. దాదాపు సగం (49% ) స్పందనదారులు గత మూడు నెలలుగా జీతాల కోతలు ఎదుర్కొన్నారు. దాదాపు 20% మంది లేఆఫ్స్‌ లేదా శెలవుల్లో ఉండిపోయారు. ఆదాయంలో తరుగుదల చోటు చేసుకుంటే మూడు నెలలకు మించి తాము ఆర్ధికంగా జీవించలేమని 49% మంది స్పందనదారులు వెల్లడించారు.