prioritize audio quality while purchasing smartphones

New study | స్మార్ట్‌ఫోన్స్‌ ఆడియో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నఇండియన్ కస్టమర్స్..

Business Electrical news Featured Posts National Technology Trending
Spread the News
CMR Study reveals Indian consumers continue to prioritize audio quality while purchasing smartphones


CMR Study reveals Indian consumers continue to prioritize audio quality while purchasing smartphones

365 తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్ ,న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18, 2021: గత సంవత్సరకాలంగా, వినియోగదారుల జీవితాలలో ఆడియో అంతర్భాగంగా మారుతుంది. ఆడియో ఇప్పుడు వారి జీవితాలలో అత్యంత కీలకం అయింది. వీడియో లేదా ఆడియో ఎక్కడైనా సరే షేర్డ్‌ వర్ట్యువల్‌ అనుభవాలను పంచుకునేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నాణ్యమైన ఆడియో అనుభవాలనేవి స్మార్ట్‌ఫోన్‌లలో తప్పనిసరిగా మారాయి.భారతదేశపు అత్యంత నమ్మకమైన సాంకేతిక పరిశోధన, కన్సల్టింగ్‌ సంస్థ, సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (CMR) ,విప్లవాత్మక ఆడియో,వీడియో అనుభవాలను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అందించడంలో దశాబ్దాల తరబడిన నైపుణ్యం కలిగిన కంపెనీగా గుర్తింపు పొందిన డాల్బీ తో భాగస్వామ్యం చేసుకుని తమ రెండవ ఎడిషన్‌ అధ్యయనంను ‘వాట్‌ ఆడియో మీన్స్‌ ఫర్‌ ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌ 2021?’ (2021లో భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల దృష్టిలో ఆడియో అంటే అర్థమేమిటి?) శీర్షికన విడుదల చేసింది.ఈఅధ్యయనం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ల కోణంలో ఆడియో పట్ల వినియోగదారుల అభిప్రాయాలను వెల్లడించడంతో పాటుగా ఆబ్జెక్ట్‌ ఆధారిత భావి తరపు లీనమయ్యే ఆడియో సాంకేతికతలైనటువంటి డాల్బీ అట్మాస్‌ పట్ల వినియోగదారుల ప్రాధాన్యతలను సైతం వెల్లడించింది.

prioritize audio quality while purchasing smartphones
prioritize audio quality while purchasing smartphones

ఈ అధ్యయనంలో కనుగొన్నదాని ప్రకారం ,వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలులో ఆడియో నాణ్యత అత్యధికంగా(69%) ప్రభావం చూపుతుంది. దీనిని అనుసరించి బ్యాటరీ (65%) మరియు కెమెరా (63%) ఉంటున్నాయి. డిజిటల్‌ నివాసితులు (18–24 సంవత్సరాల వయసులోని వ్యక్తులు) అత్యధికంగా కంటెంట్‌ను వినియోగిస్తున్న వినియోగదారులు. వీరు వారానికి 20గంటలకు పైగానే ఆన్‌లైన్‌లో ఆడియో వినియోగం కోసం వెచ్చిస్తున్నారు. ఈ డిజిటల్‌ నేటివ్స్‌ సరసన చేసిన అధ్యయనంలో వినియోగదారుల సంఖ్య పరంగా 8% వృద్ధి గత సంవత్సరపు వార్షిక సర్వేతో పోలిస్తే కనిపించింది. 2021లో వారు ఆడియో ను తమ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలులో అత్యంత కీలకమైన అంశంగా పరిగణిస్తున్నారు (71%). సాంకేతికత పట్ల పూర్తి అవగాహన ఈ డిజిటల్‌ నేటివ్స్‌కు ఉంది స్మార్ట్‌ఫోన్‌ ఓఈఎంలు తీసుకువస్తున్న కెమెరా,బ్యాటరీ ఆవిష్కరణల పట్ల అమితంగా వారు సంతృప్తి పడుతున్నారు.

సినిమాలు (86%), సంగీతం (82%), వినియోగదారులు సృష్టించిన కంటెంట్‌(68%) వంటి మూడు అంశాలు, తమ స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులు అమితంగా ప్రాధాన్యతనిస్తున్న మూడు కీలక అంశాలుగా నిలిచాయి.వినియోగదారులు సృష్టించిన కంటెంట్‌, అదీ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వంటివి విస్తృతం కావడంతో పాటుగా ఎపిసోడిక్‌ కంటెంట్‌ వినియోగాన్ని అధిగమించాయి.మూడవ అత్యంత ప్రాధాన్యత తరహా గా ఇది నిలిచింది. వినియోగదారులు ఇప్పుడు మరింత డెప్త్‌, డిటైల్‌ కోరుకుంటున్నారు. వీటితో పాటుగా మరింతగా లీనమయ్యే, మహోన్నత
ఆడియో అనుభవాలనూ కోరుకుంటున్నారు. వాయిస్‌, డైలాగ్‌ స్పష్టత, డెప్త్‌ అండ్‌ డిటైల్స్‌,లీనమయ్యే అనుభవాలను కోరుకోవడం అనేది 68% వృద్ధి చెందింది.
ప్రభు రామ్‌, హెడ్‌– ఇండస్ట్రీ ఇంటిలిజెన్స్‌ గ్రూప్‌, CMR మాట్లాడుతూ ‘‘ దాదాపు సంవత్సరంకు పైగా భౌతిక దూరం గడిపిన తరువాత, ఆడియో వినియోగధోరణి మరింతగా పెరిగింది.

prioritize audio quality while purchasing smartphones
prioritize audio quality while purchasing smartphones

ఆడియోతో వినియోగదారుల బంధం నిత్యం పెరుగుతూనే ఉంది. విభిన్నమైన కంటెంట్‌లు-ఎపిసోడిక్‌ షోలు, సంగీతం, సినిమాలు, లైవ్‌ స్పోర్ట్స్‌ లేదా మొబైల్‌
గేమింగ్‌ వ్యాప్తంగా ఆడియో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. యువత కోసం, అత్యున్నతమైన,ప్రీమియం డిజిటల్‌ ఆడియో అనుభవాలు వారి రోజువారీ పరిశుభ్రతకు ఓ ఆకృతిని ఇవ్వడంతో పాటుగా తమ ప్రియమైన వారితో వారి భావోద్వేగ సంబంధాలనూ వృద్ధి చేస్తుంది. ఈ ఫలితంగానే, వినియోగదారులు ఇప్పుడు మెరుగైన, అత్యుత్తమ ఆడియో అనుభవాలను కోరుకుంటున్నారు. వీటిని పరిశ్రమలో అత్యుత్తమ ఆవిష్కరణలైనటువంటి డాల్బీ అట్మాస్‌ లాంటివి సాధ్యం చేస్తున్నాయి’’ అని అన్నారు.

అత్యంత ఆసక్తికరమైన అధ్యయన ఫలితాలలో కొన్ని కీలకాంశాలు :

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ఆడియో నాణ్యత అనేది తప్పనిసరి ఫీచర్‌గా మారింది :

.డిజిటల్‌ నేటివ్స్‌ (18–24 సంవత్సరాలు), డిజిటల్‌ డిపెండెంట్లు (25–30 సంవత్సరాలు) లేదా డిజిటల్‌ లగ్గార్డ్స్‌ (31–40 సంవత్సరాలు) నడుమ , స్మార్ట్‌ఫోన్‌ ఆడియో నాణ్యత అనేది అత్యంత కీలకమైన కొనుగోలు చోధక అంశం (69%)గా నిలిచింది. దీనిని అనుసరించి కెమెరా, బ్యాటరీ ఉన్నాయి.
.గత సంవత్సర కాలంగా, తమ తరువాత స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు వేళ స్మార్ట్‌ఫోన్‌ ఆడియో నాణ్యత అత్యంత ప్రాధాన్యత అంశంగా మారిందంటున్న డిజిటల్‌ లగ్గార్డ్స్‌లో 5% వృద్ధి కనిపిస్తుంది.

దూరమే కానీ దగ్గరగా : నాణ్యమైన ఆడియో, వినియోగదారులను బంధిస్తుంది :

prioritize audio quality while purchasing smartphones
prioritize audio quality while purchasing smartphones

. ప్రతి నలుగురు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులలో ముగ్గురు మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి తమ స్నేహితులు/కుటుంబ సభ్యులతో అధికంగా కనెక్ట్‌ అయి ఉంటున్నారు.
.73% మంది వినియోగదారులు తమ ప్రియమైన వారితో వర్ట్యువల్‌గా కనెక్ట్‌ కావడానికి
ప్రాధాన్యతనిస్తున్నారు. పండుగలను వేడుక చేసుకోవడం (52%), వీడియో కాల్స్‌ ద్వారా ప్రియమైన వారితో బంధం ఏర్పరుచుకోవడం(51%), ఆన్‌లైన్‌లో ఆడియో/ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ వేదికల పై కలువడం (46%) మ్యూజిక్‌బ్యాండ్లను ఆన్‌లైన్‌లో కలిసి చూడటం (38%) వంటివి కనిపిస్తున్నాయి.

కంటెంట్‌ వినియోగం, మరీముఖ్యంగా సుదీర్ఘంగా వినియోగించడం పెరుగుతుంది:

prioritize audio quality while purchasing smartphones
prioritize audio quality while purchasing smartphones

.సినిమాలు,సంగీతం మాత్రమే కాకుండా వినియోగదారులు ఆడియోను నిర్థిష్టమైన సందర్భాలలో వినియోగిస్తున్నారు. వీటిలో లైవ్‌ టీవీ (75%), గేమింగ్‌(68%), క్రీడలను వీక్షించడం (58%) వంటివి ఉన్నాయి.
.సుదీర్ఘ రూపంలో కంటెంట్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. సుదీర్ఘ సమయం ఆన్‌లైన్‌లో కంటెంట్‌ వినియోగం (2గంటల కన్నా అధికం) చేస్తున్నవినియోగదారుల పరంగా 67%వృద్ధి గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. దీనితో పాటుగాలఘు వీడియోలను చూడటం పరంగా 42% క్షీణత కనిపించింది.
. 2021లో, వినియోగదారులు ఫ్రీమియం నుంచి ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వైపు మారారు. గత సంవత్సరంతో పోలిస్తే పెయిడ్‌ చందాదారుల సంఖ్య 9% వృద్ధి చెందింది.డాల్బీ అట్మాస్‌ తో లీనమయ్యే,మెరుగైన ఆడియో అనుభవాలను వినియోగదారులు కోరుకుంటున్నారు

.గత సంవత్సరంతో పోలిస్తే 2021లో ఆడియో నాణ్యత పరంగా సంతృప్తి అనేది పెరిగింది. విభాగాల పరంగా చూస్తే గేమింగ్‌ (11% వృద్ధి ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ కనిపించింది),వీడియో వినియోగం (20% వృద్ధి ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ కనిపించింది)
.ప్రతి నలుగురు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులలో ముగ్గురు డాల్బీ అట్మాస్‌ సాంకేతిక పట్ల అవగాహన కలిగి ఉన్నారు. 90% మంది తమ కుటుంబసభ్యులు,స్నేహితులకు డాల్బీ అట్మాస్‌ ఆధారిత కంటెంట్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ సూచిస్తున్నారు.

.వినియోగదారులు తమ అభిమాన కంటెంట్‌ –సినిమాలు (88%), సంగీతం (79%) ,మొబైల్‌ గేమింగ్‌ (65%) కోసం డాల్బీ అట్మాస్‌ ఆధారిత ఆడియో అనుభవాలను వినియోగదారులు కోరుకుంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే సినిమాల పట్ల ఆసక్తి 7%, గేమింగ్‌ పట్ల 8% వృద్ధి కనిపించింది.

.వీడియో లేదా ఆడియో వినియోగపరంగా వృద్ధి కనిపించడానికి డాల్బీ అట్మాస్‌ గణనీయంగా తోడ్పడిందని 82% మంది నమ్ముతున్నారు. తమ ఓటీటీ చందా నిర్ణయంలో అత్యంత కీలకమైన అంశంగా డాల్బీ అట్మాస్‌ నిలుస్తుందని 86% మంది సూచిస్తున్నారు.