Wed. Mar 29th, 2023
Minister_Koppula
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ధర్మపురి, జనవరి 27,2023: ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు సుమారు 37 లక్షల 27 వేల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలు

బ్యాటరీ వీల్‌చైర్లు, స్కూటీలు మొదలగు పరికరాలు, అర్హులైన దివ్యాంగులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పూర్తి సబ్సిడీ రుణాల మంజూరు పత్రాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో దివ్యాంగులనుపట్టించుకోలేదు. దివ్యాంగుల శాఖ మొక్కుబడిగా ఉండేది, వారి అవసరాలను తీర్చేది కాదు దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సిఎం కేసీఆర్ గారిది.

ఈ పథకం దేశంలో మరెక్కడా లేని విధంగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తూ ఉంటారని ఆయన తెలిపారు.

Minister_Koppula

వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది, దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు.

దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 37 లక్షల 27 వేల రూపాయలతో 67 మంది దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని చెప్పారు.

అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, యంపిపి చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, గొల్లపల్లి జెడ్పీటీసీ గొస్కుల జలెంధర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్ వైస్ చైర్మన్ సునీల్, సౌళ్ల సురేష్, పార్టీ అధ్యక్షులు శేఖర్ కౌన్సిలర్ లు, ఆయా గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.