Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 29,2021:

• టీఆర్ఎస్ రైతు బంధువుల ప్రభుత్వం..
• బీజేపీ రైతు రాబందుల పార్టీ
• కేంద్ర బిజెపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన సీఎం కెసిఆర్
• తెలంగాణ రైతు ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తున్నదని మండిపాడు
• బిజెపి ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం కాదు. ముంచే ప్రభుత్వం
• తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం దుర్మార్గం.
• యాసంగి వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చేతులెత్తేసింది.
• ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యాసంగి వరి పంట కొనుగోలు కేంద్రాలను పెట్టవద్దని కేబినేట్ నిర్ణయించింది.
• కేంద్రం చేతులెత్తేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలసాగుపై నిర్ణయం తీసుకోవాలి.
• స్వంత వినియోగం, విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం, వ్యాపార అవకాశమున్న వారు వరి సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్బంధం విధించదు.
• కేంద్రం చేతులెత్తేసినందున రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేయలేదు.
• రైతు నష్టపోవద్దనే వరి పంట వేయవద్దని కోరుతున్నా.
• కేంద్రం తన విధానాలతో రైతాంగాన్ని గందరగోళపరుస్తున్నది.
• బిజెపి వందశాతం రైతు వ్యతిరేక పార్టీ
• దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశాం.
• రైతుల ప్రయోజనాలను కాపాడడంలో బిజెపి కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగ్గా ఉంది.
• కెసిఆర్ చేతిలో ఎన్ని ఉన్నాయో అన్ని రైతులకు అందజేస్తం.
• తెలంగాణ రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు
• తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంట పండిస్తున్నందున కేంద్రం ఓర్వడం లేదు
• 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ
• చేతగాని దద్దమ్మ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
• కేంద్ర ప్రభుత్వం హంతక ప్రభుత్వం
• 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ
• సాక్షాత్తూ ప్రధానమంత్రే క్షమాపణలు చెప్పిండు..
• కేంద్రంలో బీజేపీది.. బుల్ బుల్ ప్రభుత్వం
• రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నది బీజేపీ
• రైతులను ఆగమాగం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం
• ధాన్యం కొంటరా.. కొనరా.. అంటే సప్పుడు చేయరు
• అది చెప్పకుంట బీజేపీ వాళ్లు ఏమేమో చెప్తరు
• ఆహార భద్రత కేంద్ర ప్రభుత్వ సామాజిక బాధ్యత
• కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నది
• తన సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం
• ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ సూడలే
• టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతది
• తెలంగాణలో రైతు సంక్షేమ విధానాలు అమలు
• అందుకే ధాన్యం పంట బాగా పెరిగింది
• తెలంగాణలో దొడ్డు వడ్లే పండుతయి
• బాయిల్డ్ రైసే వస్తది.. కేంద్రం కొనాలె మరి
• కేంద్రమంత్రి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలె


• తెలంగాణలో 35 డిగ్రీల టెంపరేచర్లో పండుతయి
• కేంద్రంతోని దొడ్డు వడ్లు కొనిపించాలె
• కేంద్రమంత్రి సిఫాయి అయితే.. బాయిల్డ్ రైస్ కొనిపించాలె
• కేంద్రం కొనదు అని చెప్తే.. రండ కేంద్రమంత్రి అయితడు
• తెలంగాణలో ధాన్యం కొనమంటే కొనరు
• యాసంగిలో నూక ఎక్కువ వస్తది.. కొనాల్సిందే
• ఎంత ధాన్యం తీసుకుంటదో కేంద్రం చెప్పదు
• బీజేపీ నాయకులు కల్లాల కాడ డ్రామాలు పెడ్తరు
• టీఆర్ఎస్ వాళ్లు కేంద్రమంత్రులను కలిసేందుకు వెళ్లారు
• మీకేం పనిలేదా ? అని అడిగాడు కేంద్రమంత్రి, ఇది సరికాదు
• కేంద్రం చేతగాని తనాన్ని రాష్ట్రంపై రుద్దుతరా?
• బిజెపి వందశాతం రైతు వ్యతిరేక పార్టీ
• కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతడు
• ప్రపంచ ఆకలి సూచికలో 116 దేశాల్లో ఇండియా 101వ స్థానంలో ఉంది.
• 2016లో ఇండియా స్థానం 96 ఉండేది.
• కేంద్ర విధానాలతో.. దేశంలో ఆకలి కేకలు బాగా పెరిగాయి.
• పాకిస్తాన్ ర్యాంకు 97, బంగ్లాదేశ్ ర్యాంకు 79 నేపాల్ కూడా బాగుంది
• అన్నపురాసులు ఒకవైపు.. ఆకలి కేకలు ఒకవైపు
• ఘనత వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిండు
• ఉత్తర భారత రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పింది
• రేపు తెలంగాణ రైతులకు కూడా చెప్పాల్సి వస్తది
• రైతుల ఉసురు పోసుకోవడానికి బీజేపీ కరంటు చట్టం తెచ్చింది
• ప్రతి బోరు కాడ మీటరు పెట్టాలంటున్నది కేంద్రం
• ఇదేందంటే.. రైతు మెడపై కత్తి పెడతానంటది
• లేకుంటే రాష్ట్రానికి వచ్చే హక్కులు, అధికారాలు కట్ చేస్తదట
• కేంద్రమే విద్యుత్ మీద పెత్తనం తెస్తదట
• కేంద్రం పెత్తనం ఉంటే కరంటు 24 గంటలు వద్దంటరు
• అందరిలాగానే 16 గంటలే ఇస్తమంటరు.. ఇది మనకు కుదురుతదా?
• రైతులు, సామాన్యులకు రక్షణ ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలె
• మేం వడ్లు కొనం.. అయినా కళ్లాల కాడ కొట్లాడుతం అంటరు..
• పనికిమాలిన చట్టాలు చేసేది బీజేపీ.. వాపసు తీసుకునేది బీజేపీయే
• 750 మంది రైతులకు క్షమాపణలు చెప్పేదీ కేంద్ర ప్రభుత్వమే
• ఏడేండ్లలో మోడీ ప్రభుత్వం సాధించేమిటి?
• పేదలకు, దళితులు, గిరిజనులు, బీసీలు, యువతకు, మహిళలకు చేసిందేమిటి?
• దేశంలో అప్పులు పెంచింది బీజేపీ
• 80 లక్షల కోట్ల అప్పులు చేసింది
• పాత అప్పులు 50 లక్షల కోట్లు ఉన్నయి
• దేశాన్ని రావణకాష్టం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం
• దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నది కేంద్రం
• తెలంగాణ అన్నింట్లో నంబర్ వన్ ఉన్నది
• రాష్ట్రంలో మత్స్య సంపద, గొర్ల సంపద, పశు సంపద పెరుగుతున్నది
• ఇదంతా ప్రగతి కాదా.. కేంద్రానికి కనిపిస్తలేదా?
• బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తున్నది
• పనికిమాలిన, అవగాహనలేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడున్నడు
• వరి మాత్రమే వేయండి అని రైతులకు చెప్తడు
• కేంద్రమంత్రిని అడిగితే, అవగాహన లేక మాట్లాడిండు అన్నడు
• బీజేపీ రైతులను మోసం చేస్తది.. మళ్లీ ఉల్టా మాట్లాడుతది
• ఉప్పుడు బియ్యం కొనం.. అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డే చెప్పిండు
• కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనం అని, పాలసీ మార్చుకున్నం అన్నది
• కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి.. రాష్ట్రం ఏం చేస్తది?
• అందుకే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదు.
• కేంద్రానివి అసమర్ధ విధానాలు
• బీజేపీ వాళ్లకు పాలించడం చేతకాదు
• బహిరంగ చర్చకు వస్తారా? సిద్దం
• తెలంగాణలో ఎంత కొంటరో చెప్పండి
• రైతులు తిండికి పండించుకోవచ్చు
• విత్తన కంపెనీలు కొంటే సరే
• మిల్లర్లు ఓకే అంటే కొనుక్కోవచ్చు
• అంతేగానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు
• మేం బీజేపీలాగా చిల్లర రాజకీయాలు చేస్తలేం
• కేంద్రం నిరాకరించింది కాబట్టి.. రాష్ట్రం ధాన్యం కొనుగోలు చెయ్యదు.
• కేంద్రం కనీస మద్దతు ధర చట్టం కూడా ఈ సెషన్ లోనే తేవాలె