Fri. Apr 19th, 2024
TEchWave

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,24 డిసెంబర్, 2022, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ ఐటి, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ టెక్‌వేవ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నటెక్ వేవ్ టీమ్‌లు, క్లయింట్‌ల కోసం క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది ఆసంస్థ.

క్రిస్మస్ వేడుకలు ఉత్తర అమెరికా, ఆసియాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉద్యోగులంతా ఒకచోట చేరి ఆనందకరమైన వేడుకల్లో పాల్గొన్నారు.

TEchWave

పండుగలు ప్రజలను ఒకదగ్గరికి తీసుకురావడానికి ఆనందాన్ని పంచడానికి ఒక గొప్ప మార్గం, ఉద్యోగులు రోజువారీ పని కాకుండా ఆయా ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, ఉత్సాహాన్నినింపడానికి ఉపయోగపడుతుంది.

క్రిస్మస్ స్ఫూర్తితో Techwave క్రిస్మస్ సీక్రెట్ శాంటా, ఆకర్షణీయమైన పండుగ-నేపథ్య వస్త్రధారణ, ఆటలతో సహా ఈవెంట్స్ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రోత్సహించడానికి, అభినందించడానికి వివిధ గుర్తింపు ,రివార్డ్ ప్రోగ్రామ్‌లను అమలు చేశారు టెక్ వేవ్ సంస్థ నిర్వాహకులు.

” క్రిస్మస్ వేడుకలను ఉద్యోగులంతా సరదాగా జరుపుకోవడం కార్యాలయంలో సంస్కృతిని జరుపుకోవడానికి టెక్ వేవ్ క్రిస్మస్ వేడుకలనునిర్వహించడం ద్వారా సానుకూలమైన, సమగ్రమైన కార్యాలయాన్ని సృష్టించిందని టెక్‌వేవ్ సీఈఓ రాజ్ గుమ్మడపు అన్నారు.

ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా గడిపినందుకు మేము సంతోషిస్తున్నాము” అని ఆయన తెలిపారు.