Thu. Apr 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణా,డిసెంబర్ 16,2021: ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణా రాష్ట్రాలలోని పచ్చిమిరప రైతులు త్రిప్స్‌ మహమ్మారి కారణంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే  ఈ రెండు రాష్ట్రాలలోనూ దాదాపు 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా దాదాపు 3వేల రూపాయల నష్టం  రైతులకు వాటిల్లిందని అంచనా. ఇది వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా వారిని పూర్తి నిరాశకూ గురి చేస్తుంది.

రైతుల వద్ద ప్రస్తుతం త్రిప్స్‌ మహమ్మారిపై ప్రభావం చూపగలిగేటటువంటి ఎలాంటి పురుగుమందులూ అందుబాటులో లేవు. గతంలో మిరప పంటపై వచ్చే త్రిప్స్‌,వరి పంటలో కనిపించే బీపీహెచ్‌పై అత్యద్భుతమైన నియంత్రణ చూపిన ఫోసాలోన్‌ , డీడీవీపీ లాంటివి నిష్పలంగా మారడం లేదా రెగ్యులేటర్లు నిషేదం విధించడం జరిగింది. ఈ రెండు ఉత్పత్తులూ  వినూత్నమైన ప్రభావం చూపే పురుగుమందులుగా  నిలువడంతో పాటుగా త్రిప్స్‌, బీపీహెచ్‌,  పత్తిపంటలో పింక్‌ బౌల్‌వార్మ్‌ మొదలైన వాటిపై అత్యద్భుతమైన ప్రభావమూ చూపాయి.

రెగ్యులేటర్లు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియంత్రణ అధికారులు రైతుల ఆదాయం, వారి జీవనోపాధి, పంటలకు కలిగే ఇబ్బంది గురించి ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఉత్పత్తులను నిషేదించాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారా రైతులను తీవ్ర ఇబ్బందులలోకి నెట్టివేశారు. నియంత్రణ అధికారులు తమ సమీక్షలలో ప్రత్యామ్నాయాలు లభిస్తున్నాయని తరచుగా చెబుతుంటారు కానీ సవివరమైన విశ్లేషణలను వారు ఎన్నడూ చేయరు. అంతేకాదు, లభ్యమవుతున్న పురుగుమందులు నిర్ధిష్టమైన కీటకాలపై చూపే ప్రభావమూ గుణించరు. రైతులపై ఆర్ధిక భారం కలిగించకుండా అందుబాటు ధరల్లోని ప్రత్యామ్నాయాలనూ చూపరు.

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారి పేట గ్రామానికి చెందిన రైతు రాగం మల్లేశం తన అనుభవాలను పంచుకుంటూ  ‘‘తామిప్పుడు తీవ్ర కష్టాల పాలు కావడంతో పాటుగా జీవనోపాధినీ కోల్పోయాము. మా పంటలను త్రిప్స్‌ పూర్తిగా నాశనం చేసింది. మార్కెట్‌లో మాకు ప్రత్యామ్నాయం కూడా లభించడం లేదు’’ అని అన్నారు.

ఖమ్మం జిల్లా ఎక్నూరు మండలం టీఎల్ పేట గ్రామానికి చెందిన రైతు పల్లెబోయిన ముత్తయ్య మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వం తప్పనిసరిగా ఫోసలోన్‌,డీడీవీపీని తిరిగి తీసుకురావాలి. ఈ రెండింటి తో మాకు మంచి అనుభవాలే ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇప్పుడు ఎదుర్కొంటున్నట్లుగా నష్టాలను మేము ఎదుర్కోలేదు. అధికారులు మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఈ ఉత్పత్తులను నిషేదించారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోని ఉత్పత్తులు అంతగా ప్రభావం చూపడం లేదు’’ అని అన్నారు.

సాధారణంగా ఈ నిషేదాలు  లోపభూయిష్ట ప్రమాణాల ఆధారంగా పూర్తిగా సమీక్ష చేయకుండా లేదా రైతులతో సంప్రదింపులు చేయకుండానే చేస్తుంటారు. మన దేశంలో ఓ  ఉత్పత్తిని నిషేదించారంటే, సాధారణంగా దానిని ఇతర దేశాలలో నిషేదించడమే కారణమవుతుంది లేదంటే వ్యవసాయ–వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా  పర్యావరణ వేత్తలు  పలుమార్లు ఆందోళనలు చేయడం కారణమవుతుంటుంది. రైతులు సురక్షితంగా  ఈ ఉత్పత్తులను వినియోగించి విజయవంతమైన అనుభవాలను పొందడాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు  ,ఈ తరహా ఉత్పత్తుల సమీక్షలో  రైతుల అనుభవాలను అసలు పరిగణలోకి తీసుకోరు. రైతులకు ఏది మంచిదన్నది పరిగణలోకి తీసుకోకుండా,ఈ తరహా ఉత్పత్తుల వినియోగంలో వారి 2–3 దశాబ్దాల అనుభవం పరిగణలోకి తీసుకోకుండా పురుగుమందులను నిషేదించడమనేది అత్యంత ప్రాచుర్యం పొందిన నిర్ణయంగా నిలుస్తుంటుంది.

భవిష్యత్‌లో పంటలకు నష్టం కలిగించే ఏదైనా తీవ్రమైన క్రిమికీటకాలు పుట్టుకువస్తే, నియంత్రణ అధికారులు ఎలాంటి బాధ్యతనూ తీసుకోరు, సరికదా రైతులు ఏవైనా ఉత్పత్తులను నిషేదించమని కోరినప్పుడూ తగిన చర్యలు తీసుకోరు. రెగ్యులేటరీ అధికారులు  వ్యవసాయ రసాయనాల నిరంతర వినియోగాన్ని సమీక్షించేటప్పుడు విభిన్నమైన చర్యలు (ఎంఓఏ) పాత్రను సైతం తెలుసుకోవడం కీలకం. ఈ ఎంఓఏ అనేది జీవ ప్రభావానికి కారణమైన, లక్ష్యంగా చేసుకున్న ప్రొటీన్‌ గుర్తింపు పై ఆధారపడి ఉంటుంది.

ఆర్గానో ఫాస్పరస్‌ గ్రూప్‌ ఆగ్రో కెమికల్స్‌ తరహా నిర్థిష్టమైన ఎంఓఏ ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అవి రెసిస్టెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను బలహీనపరుస్తుంది దీనికి కీటకాలు/తెగులు నియంత్రణ సూచనలలో విభిన్నమైన ఎంఓఏ రొటేషన్‌ లేదా ప్రత్యామ్నాయం కావాల్సి ఉంటుంది.

నూతన ఎంఓఏతో నూతన ఆగ్రోకెమికల్స్‌ను అభివృద్ధి చేయడం కష్టసాధ్యమైన అంశం,ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల  ఆ ఉత్పత్తులకు ప్రతిరోధకత అభివృద్ధి చెందకుండా రక్షించడం అత్యంత కీలకం. సమర్థవంతమైన  రీతిలో కీటక నిరోధం, నిర్వహణ కోసం టూల్‌ బాక్స్‌లో భాగంగా ప్రస్తుతం అందుబాటులోని ఎంఓఏను రెగ్యులేటర్లు పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. అలాగే మిరప పంటలో త్రిప్స్‌, పత్తి పంటలో పింక్‌ బోల్‌వార్మ్‌, పత్తిపంటలో తెల్లదోమ, మొక్కజొన్నలో మిడతలు, ఫాల్‌ ఆర్మీ వార్మ్‌ వంటి వాటిని నియంత్రించడానికి, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సైతం తోడ్పడేందుకు ఇవి కీలకంగా ఉంటాయి.

నియంత్రణ అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండటంతో పాటుగా రైతుల అనుభవాలు,పూర్తి పరిశీలన ద్వారా మాత్రమే తమ సమీక్షలను చేయాలి.