Fri. Mar 29th, 2024
TSCS-Shanthi-kumar_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 25,2023:ట్యాంక్ బండ్ పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహా పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ అంబెడ్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున, ఏప్రిల్ 14వతేదీన, ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఈ విగ్రహ పనుల పురోగతిని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పరిశీలించారు.

TSCS-Shanthi-kumar_365

ఈ సందర్భంగా శాంతి కుమారి నిర్మాణపనులన్నింటినీ ఏప్రిల్ 10 తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా విగ్రహం కింది భాగంలో నిర్మిస్తున్న యాంపి థియేటర్ పనులను కుడా ఆమె పరిశీలించారు. విగ్రహ ఆవరణలో ఏర్పాటుచేస్తున్న ల్యాండ్ స్కేపింగ్ పనులు, ఇతర సివిల్ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు శాంతి కుమారి బిఆర్ అంబేద్కర్ సెక్రెటేరియేట్ నిర్మాణ పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతి కుమారితోపాటు రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈ.ఎన్.సి గణపతి రెడ్డిలు పాల్గొన్నారు.