Wed. Mar 29th, 2023
CMKcr_Ts
Spread the News

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 26,2023: 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

365Telugu gif

జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

CMKcr_Ts

ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

365Telugu gif

ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా దేశం కోసం అమర జవానుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.