భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి-ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

AP News Devotional Featured Posts Trending ttd news
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 10 మే 2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

మే 21 వ తేదీ నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి పాల్గొన్నారు.