తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్. కృష్ణయ్యకు ఘన సన్మానం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 19,2022 : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శశాంక్ బీసీ సంఘం నాయకుడు ఆర్ .కృష్ణయ్య ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభసభ్యుడిగా ఎంపికైన ఆయన్ను బీసీ భవన్ లో పసుపులేటి శశాంక్ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. ఈ సందర్బంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శశాంక్ మాట్లాడుతూ “ఆర్. కృష్ణయ్య అన్న ప్రతినిత్యం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతూ 40 ఏళ్లుగా అనేక సేవలందించారని చెప్పారు.

Continue Reading

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు – మహాపూర్ణాహుతితో ముగియనున్న వసంతోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మే 17 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగ‌ళ‌వారం రాత్రి వైభవంగా ముగియనున్నాయి.

Continue Reading

భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి-ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 10 మే 2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Continue Reading
mothers-day special story

మహా సామ్రాజ్యానికి రాజైనా…. ఓ తల్లికి మాత్రం కొడుకే..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,మే 8,2022: ఈ సృష్టే ఎంతో అపురూపమైనది…అందులో అత్యంత అపురూపమైనది స్త్రీ మూర్తి … ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం నుంచి కలిగే ఆనందం అనంతం… మాటల్లో చెప్పలేనిది. అది అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం ఆనందంగా భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమ మరొకటి లేదని అనాదిగా నిరూపిస్తున్నా…అద్దె గర్భాలతో నెట్టుకొస్తున్నారు కొందరు.ఎన్నో ప్రయాసలకోర్చి తమబిడ్డలను కాపాడుకుంటూ అన్నివేళల్లో వారి అభ్యున్నతి కోరుకుంటున్న మాతృప్రేమకు అందరం శిరస్సు వంచి పాదాభి వందనం చేయాల్సిందే..అయినా మనకోసం ఇంత చేస్తున్న అమ్మను పట్టించుకోని ఈరోజుల్లో… మనకోసం ఇంత చేస్తున్న తల్లి ప్రేమకు వెలకట్టగలమా..? ఎవరికివారే ఆలోచించుకోవాలి…

Continue Reading

మే 8వ తేదీన తెలంగాణ‌లోని కొత్త‌గూడెంలో శ్రీనివాస కల్యాణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే 6,2022: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా మే 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్రం భ‌ద్రాది కొత్త‌గూడెం జిల్లా కొత్త‌గూడెంలోని ప్ర‌కాశం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

Continue Reading
raai-lakshmi

‘జనతాబార్‌’ సినిమాలో రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్ర..

365తెలుగు డాట్ కామ్ ఆమ్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 4, 2022: (Raai Laxmi’s ‘Janata Bar’ First Look released) రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో రోచి శ్రీమూవీస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ నెల 5న కథానాయిక రాయ్‌ లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా చిత్రం టైటిల్‌ లోగోతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ ‘నాలుగు పాటల మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ నెల ఎనిమిది నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆ పాటలను చిత్రీకరిస్తాం. స్పోర్ట్స్‌ నేపథ్యంలో జరగుతున్న అన్యాయాలను, లైంగిక వేధింపులకు ఓ యువతి చేసిన పోరాటమే ఈ చిత్రం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమాజానికి మంచి సందేశం కూడా వుంది.

Continue Reading