Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,మే1, 2023:తప్పుదోవ పట్టించే ప్రకటనలు, క్లెయిమ్‌లకు పాల్పడుతున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల (ఎఫ్‌బిఓలు) 32 తాజా కేసులు నమోదయ్యాయని ఫుడ్ రెగ్యులేటర్ (FSSAI) తెలిపింది. శాస్త్రీయంగా నిరూపించని తప్పుడు క్లెయిమ్‌లు, క్లెయిమ్‌లను ఉపసంహరించుకోవడానికి సంబంధిత FBOలకు నోటీసులు పంపాలని లైసెన్స్‌దారులను ఆదేశించినట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) ఒక ప్రకటనలో తెలిపింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనలలో పాల్గొన్న FBOలలో పోషకాలు అధికంగా ఉండే ఉత్పత్తులు, శుద్ధి చేసిన నూనెలు, పప్పులు, పిండి, ముతక ధాన్యం ఉత్పత్తులు, నెయ్యి తయారీదారులు, విక్రయదారులు ఉన్నారు. ప్రకటన ప్రకారం, FSSAI అడ్వర్టైజ్‌మెంట్ మానిటరింగ్ కమిటీ తప్పుదారి పట్టించే ప్రకటనలు FBOల క్లెయిమ్‌లపై 32 ప్రాథమిక కేసులను నమోదు చేసింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్రకటనలు- దావాలు) రెగ్యులేషన్, 2018లోని నిబంధనలను ఉల్లంఘించినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. తదుపరి చర్యల కోసం సంబంధిత ఎఫ్‌బీఓలకు నోటీసులు పంపాలని ఫుడ్ రెగ్యులేటర్ లైసెన్స్‌దారులను ఆదేశించింది.