Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 19,2021: క్రిస్టమస్, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేకు ను తయారు చేసే కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయపద్దతిలో పండుగలా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా నిర్వహించబడే ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమం మంచి రోజులను, సంతోషాన్ని తీసుకొని వస్తుందన్న నమ్మకంతో జరుపబడుతుంది. ఎలానైతే మన కుటుంభంలోని మహిళలు అంటే కుమార్తెలు, తల్లులు తమ తమ కుటుంభంలోనే కాకుండా సమాజంలో కూడా ప్రేమను, శాంతిని పంచుతారో అలానే క్రిస్టమస్ పండుగ కూడా ప్రేమ, శాంతి కి ప్రతిబింబంగా నిలుస్తుంది. అందుకే ఇలాంటి ప్రత్యేక సందర్భాలను మన తర్వాత తరం వారికి గుర్తుకు తెచ్చేలా, వారిని ఇలాంటి ప్రత్యేక పండుగలను ఆనందంతో నిర్వహించుకొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెడిసన్ హైటెక్ సిటీ వారు ఏటా నిర్వహించే పలు కార్యక్రమాలలో ఈ సాంప్రదాయ పద్దతిలో నిర్వహించబడే కేక్ మిక్సింగ్ ఒక భాగం.

https://twitter.com/hegdepooja?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1461343145673707534%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fhegdepooja2Fstatus2F1461343145673707534widget%3DTweet

ఇలా ఏటా రెడిసన్ హైటెక్ సిటీ హోటల్ వారు నిర్వహించే ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమానికి ఈ సంవత్సరం మహిళా సంక్షేమం, ఆడ పిల్లలకు మేలు కలిపించే పలు చర్యలు తీసుకోవడం, తద్వారా పేదరికంలో ఉన్న అమ్మాయిలకు వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకొనేలా సహాయపడడం అనే ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని కూడా జోడించడం జరిగింది. ఇలా మహిళలకు అందులోనూ ముఖ్యమంగా ఆడపిల్లలకు సహాయపడే ఈ కార్యక్రమాలను గత ఐదు సంవత్సరములుగా రెడిసన్ హైటెక్ సిటీ వారు మన ప్రియతమ ప్రధాని రూపొందించిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాల స్పూర్తితో నిర్వహిస్తోంది.

హైదరాబాదులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రథమ్ ఫౌండేషన్ వారితో కలసి రెడిసన్ హైటెక్ సిటీ హోటల్ వీటిని అమలు చేయడం జరుగుతోంది. అందుకే ఈ క్రిస్టమస్ ద్వారా వచ్చే ప్రత్యేక ఆదాయాన్ని ప్రథమ్ ఫౌండేషన్ వారికి అందజేసి ఈ లక్ష్యానికి వినియోగించాలని రెడిసన్ హైటెక్ సిటీ హోటల్ యాజమాన్యం నిర్వహించింది. ఇలా మన మాతృభూమికి చెందిన ప్రతి ఆడపిల్లకు విద్యను అందించి తద్వారా సమాజంలో వారు గౌరవప్రదమైన స్థానం కలిపించేలా తోడ్పడతామన్న ప్రమాణం చేస్తూ ఈ సంవత్సరపు కేక్ మిక్సింగ్ కార్యక్రమం ప్రారంభించబడింది. ముందుగా గ్లవ్ లను తొడిగిన చేతులతో సిబ్బంది ఒక పెద్ద టేబుల్ పై అందంగా అలంకరించిన వివిధ ఫలాలకు చెందిన ముక్కలకు బాదం, కిస్ మిస్, వివిధ రంగుల చెర్రిస్ ను జత చేర్చి కార్యక్రమానికి హాజరైన గెస్టులతో కలసి చక్కగా కలిపారు. నంతరం వాటిపై పలు రకములైన లిక్కర్ ను బాటిళ్ల నుండి నెమ్మదిగా చిలకరిస్తూ కలపడం ప్రారంభించారు.

https://twitter.com/hegdepooja/status/1461262991068778497/photo/1

వీటన్నింటినీ చక్కగా కలిపేందుకు సిబ్బంది కార్యక్రమానికి హాజరైన గెస్టులు చూపిన ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని కొన్ని రోజుల పాటూ పులియపెట్టి ఆనంతరం తగినంత పిండిని కలిపి దాని నుండి ప్లమ్ కేకులను, ఫుడ్డింగ్ లను తయారు చేసి క్రిస్టమస్ నాటికి అందరికీ అందజేస్తారు.
ఈ సందర్భంగా పవన్ కుమార్, రెడిసన్ హైటెక్ సిటి జనరల్ మేనేజర్, వారు మాట్లాడుతూ రానున్న పండుగ కాలాన్ని స్వాగతించడానికి ముఖ్యంగా క్రిస్టమస్ కు ముందుగా కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సాంప్రదాయాన్ని తాను ఎంతో ప్రేమిస్తానని, పండుగరోజులకు స్వాగతం పలుకపాడనికి ఇది ఎంతో వినూత్నమైన పద్దతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కలసి పాల్గొనడం ద్వారా వారి మధ్య స్నేహ పూరితమైన వాతావరణం ఏర్పడడమే కాకుండా కలసి మెలసి జీవించడం ఔన్నత్యాన్ని గుర్తుకు తెస్తాయని పేర్కొన్నారు.