Sun. May 19th, 2024
father statue

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 22,2022: మనకు ఆత్మీయులైన వారెవరైనాచనిపోతే..ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ వ్యక్తి ఒక్కసారైనా కనిపిస్తే బాగుండు అని అనిపిస్తుంది. కనీసం మాట్లాడ లేక పోయినా.. కంటికి కనబడితే చాలు.. అనుకున్న సమయంలో మనకు దూరమైన వ్యక్తి సడెన్ గా ప్రత్యక్షమైతే ఈ ఫీలింగ్ చెప్పడం కంటే చూడడమే బాగుంటుంది. ఓ అన్న తన చెల్లెలి కోసం చనిపోయిన తండ్రి మైనపు బొమ్మతో ఆ లోటును తీర్చేశాడు.

father statue

అన్న అంటే నాన్నలో సగం అంటారు. అమ్మా, నాన్నల తర్వాత సోదరికి అంతటి ప్రేమను పంచేది అన్నే. చెల్లెలి ముఖంలో సంతోషం చూసేందుకు అన్న ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తాడు. సోదరి కష్టాన్ని తన కష్టంగా.. చెల్లలు సంతోషాన్ని తన సంతోషంగా భావించే అన్నలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే అన్న ఈ కోవకి చెందినవాడే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచిన ఓ తండ్రి దురదృష్టవశాత్తు వారికి దూరమయ్యాడు. ఇటీవలే తండ్రి మరణించడంతో అన్న దగ్గరుండి చెల్లెలి పెళ్లి వైభవంగా జరిపించాడు.

father statue

అయితే పెళ్లిలో అన్ని ఉన్నా నాన్న లేని లోటు స్పష్టంగా కనిపి స్తుండటంతో సోదరుడు ఓ అద్భుతమైన ఆలోచన చేశాడు. చెల్లెలి పెళ్లిలో నాన్న లేని లోటును తీర్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపాడు. చనిపోయిన తండ్రి సజీవ రూపాన్ని మైనంతో తయారు చేయించాడు . సరిగ్గా పెళ్లి సమయానికి మండపంలోకి నాన్న ప్రతి రూపాన్ని తీసుకొచ్చి అందరిని ఆశ్యర్య పరిచాడు. వీల్‌చైర్‌లో తండ్రి వస్తుండటం చూసి పెళ్లికూతురు కళ్లల్లో కన్నీరు వరదలై పారింది. అది మైనపు బొమ్మ అని తెలిసినా.. నాన్నరూపాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఆమె ఒక్కతేనే కాదు పెళ్లి మండపంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసును కలచి వేసింది.