Fri. Apr 19th, 2024
Britannia
Britannia

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబై,జూన్14, 2022: Britannia కాఫీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మంది ఇష్టపడతారు. కానీ, కాఫీకి వాస్తవంగా సరైన భాగస్వామి ఉందా? దేశంలోని అతి పెద్ద బేకరీ ఫుడ్స్ కంపెనీ, బ్రిటానియా ఇప్పుడు కాఫీ గురించి ఎందుకు మాట్లాడుతుందని ఆలోచిస్తున్నారా… అయితే దీన్నిగత వారం నెటిజన్లలో విస్తృతమైన చర్చకు, ఎక్కువ నిరీక్షణకు కారణమైన గందరగోళాన్నిCoffeeKaBetterHalfతో బ్రిటానియా పరిష్కరించింది. ఆహార పరిశ్రమ దిగ్గజ సంస్థ కాఫీ తాగే మీ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు సరి కొత్త కాఫీ ఫ్లేవర్ క్రాకర్‌ బ్రిటానియా బిస్‌కాఫేను విడుదల చేసింది.

Britannia

శ్రీమంతమైన కాఫీ రుచితో నిండి, దానిపై పంచదార పలుకులు చల్లిన ఈ సూపర్ థిన్, లైట్, కరకరలాడే బిస్కెట్ కాఫీ ప్రియులకు తమ కప్పుకు సరైన భాగస్వామిని అందిస్తుంది. కాఫీని కరకరలాడే స్టాండ్-అలోన్ షాట్‌గా దీన్ని ఎంచుకోండి, అది కూడా మంచిదే. కరణ్ జోహార్‌తో కలిసి ‘లీక్డ్ వీడియో’ బ్రిటానియా తన క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. కరణ్ జోహార్ అలియాస్ కేజేఓ (KJo) కాఫీ పట్ల బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్న అత్యంత చమత్కారమైన, ఫ్యాషన్ దర్శకుల్లో ఒకరన్నది బహిరంగ రహస్యమే. కరణ్ తనకు ఇష్టమైన కప్పు కాఫీని తిరస్కరించడంతోనే, ఆయన తన ప్రశాంతతను కోల్పోతున్నట్లు వీడియోలోచూపించారు…. ఎందుకు? సరే, ఎందుకంటే కాఫీ సమ్మెకు దిగింది! ఆ వీడియో వైరల్ అయ్యింది. అలాగే, అందుకు దారితీసిన కారణాలు ఏమిటనే అంశంపై ఊహాగానాలు ఎక్కువ అయ్యాయి! కరణ్‌కు పిచ్చి కోపం వచ్చింది.
https://www.instagram.com/tv/CeDnaycomVU/?igshid=YmMyMTA2M2Y=

ఈ సిరీస్‌లోని తదుపరి వీడియోలో కరణ్ కాఫీని తన మూడవ చక్రంలా భావించడం ద్వారా కలిగే బాధతో చాలా సానుభూతి పొందుతారు. కాఫీని మంచి భాగస్వామిగా గుర్తించానని పేర్కొంటారు! కరణ్ స్వయంగా చిత్రీకరించిన వీడియో –
https://www.instagram.com/tv/CeIc1I0IpI5/?igshid=YmMyMTA2M2Y=

తన 3వ వీడియోలో కరణ్ జోహార్ కాఫీకి సరైన భాగస్వామికి సంబంధించి వచ్చిన పలుసూచనలను ఫిల్టర్ చేయడం, సామర్థ్యం ఉన్న పెయిర్ల గురించి ఆలోచించడం
అసంపూర్ణంగా భావించే బాధను తగ్గించే కాఫీ తపనతో అనేక మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు నెటిజన్‌లు కలిసి అందించిన ఆప్టిమమ్ ఫ్లేవర్ ప్రొఫైల్‌లు ఇందులో ఉన్నాయి. ఆడిషన్ వీడియో – https://www.instagram.com/tv/CeNbquQI8K_/?igshid=YmMyMTA2M2Y= బెల్‌ను ఏదీ మోగించనప్పుడు, బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీకి కరణ్ ఫోన్ చేసి కాఫీకి సరైన భాగస్వామిని కనుక్కోమని వేడుకున్నాడు!

వీడియోను బహిర్గతం చేయండి –
https://www.instagram.com/tv/CeTfyt0jMAQ/?igshid=YmMyMTA2M2Y=

అలా, ఆ విధంగా బ్రిటానియా బిస్‌కాఫే విడుదలైంది. కాఫీ గొప్పతనాన్ని కలిగిన వేఫర్-సన్నని క్రాకర్‌ను ఇప్పటి తరానికి కొత్త ఓజీ క్రాకర్‌గా బ్రిటానియా తయారు చేసింది. బిస్‌కాఫే విడుదల నేపథ్యంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషిమాట్లాడుతూ, ‘‘కోట్లాది మంది భారతీయులకు అత్యంత రుచికరమైన మరియు సంతృప్తికరమైన స్నాక్స్ ప్రత్యామ్నాయాలను అందించేందుకు బ్రిటానియా స్థిరంగా కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో ఆహారానికి సంబంధించిన సంభాషణలను ఆసక్తిగా వినడం సరికొత్త అవకాశాలనుగుర్తించేలా చేసింది. కాఫీకి సరైన తోడు లేదని తెలుసుకోవడమే బిస్‌కాఫేకు ప్రేరణగా నిలిచింది.మేము బిస్‌కాఫేను మొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ కాఫీ క్రాకర్‌గా అభివృద్ధి చేయడం ద్వారా కాఫీఅనుభవాన్ని మరింత మెరుగుపరిచాము’’ అని వివరించారు.

డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో ష్బాంగ్ డిజిటల్ సొల్యూషన్స్‌లోనిఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ఉపాధ్యక్షుడు ఆయుష్ వ్యాస్ మాట్లాడుతూ, ‘‘కాఫీ మన రోజువారీజీవితాలను పూర్తి చేస్తుంది – ఉదయం మన అల్పాహారం, మన డేట్‌లు, మన వ్యాపార సమావేశాలు – అయితే కాఫీని ఎవరు పూర్తి చేస్తారు? అక్కడే బ్రిటానియా బిస్‌కాఫే వస్తుంది. ఈ ప్రత్యేకమైన ఉత్పత్తి కోసం – మేము కాఫీ మరియు దాని ‘‘భావాలను’’ వ్యక్తీకరించే సమానమైన ప్రత్యేకమైన అల్లాలి! మీరు కాఫీ గురించి ఆలోచించినప్పుడు మనకు గుర్తుకు వచ్చేది ఒకే ఒక్క వ్యక్తి.

  • కరణ్ జోహార్! ఇదే ప్రతి దాన్ని చాలా సజావుగా కొనసాగించేలా చేసింది మేము మా CoffeeKaBetterHalf – బిస్‌కాఫేను కనుగొన్నాము!’’ అని వివరించారు.
Britannia
కొత్త టీవీసీ గురించి లోవ్ లింటాస్‌లో చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ సాగర్ కపూర్ మాట్లాడుతూ,“బిస్‌కాఫే కేటగిరీలో మొదటిది కనుక బిస్కట్ కేటగిరీలో చాలా భిన్నమైన దాన్ని చేసేందుకు ఇది ఒక అవకాశం. ఉత్పత్తి ప్రత్యేకతను ఆసక్తికరమైన రీతిలో బయటకు తీసుకువచ్చేందుకు, కరణ్ జోహార్‌కు కాఫీతో ఉన్న బలమైన అనుబంధం కొంత తాజాదనాన్ని జోడించేందుకు డొమినోల విజువల్ పరికరంతో కరణ్ జోహార్‌ని ఉపయోగించడం ప్రారంభించి సంపూర్ణ కమ్యూనికేషన్ విధానాన్ని రూపొందించాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాము. బ్రిటానియా టీ ,బిస్కట్ విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన బ్రాండ్, ఇది కచ్చితంగా కాఫీతో కొత్త వినియోగ సందర్భాన్ని సృష్టిస్తుంది!’’ అని ధీమా వ్యక్తం చేశారు.రూ.10 ప్రారంభ ధర నుంచి లభించే కొత్త బిస్‌కాఫే ప్యాక్‌లు ఇప్పటికే మెట్రో మార్కెట్‌లలో అన్ని ప్రామాణిక ధరల పాయింట్‌లలో, వివిధ ప్యాక్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి.