ఎంసియులోకి అడుగుపెడుతున్నట్లు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ మార్వెల్ ప్రకటించారు.డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Business Cinema Entertainment Featured Posts National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 10,2022:డిస్నీ+ హాట్‌స్టార్‌లో జూన్ 8 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు,మలయాళంలో
ప్రసారం కానున్న మార్వెల్ స్టూడియోస్ వారి వెబ్ సిరీస్ మిస్ మార్వెల్‌లో తాను నటిస్తున్నానని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ధృవీకరించారు. దీనికి సంబంధించి ఆయన ఒక వార్తను ట్వీట్ చేసి,‘‘ప్రపంచం మనం ఎదిగేందుకు, నేర్చుకునేందుకు పలు అవకాశాలు ఇస్తుంది. ఈ సందర్భంలో మంచి ఆనందాన్ని పొందేందుకు దీన్ని బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌లో తన ఆకారాన్ని మార్చే సూపర్‌ హీరోగా ప్రధాన పాత్ర పోషిస్తున్న టీనేజ్ నటి ఇమాన్ వెల్లనితో అక్తర్ నటించనున్నారు. బిషా కె. అలీ రూపొందించిన ఈ సిరీస్‌లో మాట్ లింట్జ్, యాస్మిన్ ఫ్లెచర్, జెనోబియా ష్రాఫ్, మోహన్ కపూర్, సాగర్ షేక్, రిష్ షా, లారెల్ మార్స్‌డెన్, అడకు ఒనోనోగ్బో, లైత్ నక్లి, ట్రావినా స్ప్రింగర్,అరామిస్ నైట్ కూడా నటించారు.