Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 25, 2022: పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సంచలనాత్మక కె జి ఫ్ 2 బ్లాక్ బ్లస్టర్ సినిమాకు చెందిన కళాదర్శకత్వ విభాగం వారు తమ సినిమా కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పార్లమెంటు నమూనా సెట్ ను నిర్మించడానికి ఎకో
వాల్ అనబడే వినూత్నమైన, సరికొత్త ఉత్పత్తిని వినియోగించారు.ఎకో బోర్డ్
అనేది ఎకో యూ అనే పుణే కు సంబంధించిన బిల్డింగ్ మెటీరియల్స్ ఉత్పత్తులను
అందించే సంస్థ వారి ఉత్పత్తి.ఎకో యూ అనబడే ఈ బల్డింగ్ మెటీరియల్స్ ఉత్పత్తి సంస్థ వారు తమ ఉత్పత్తులన్నింటినీ చెక్క, మెటల్ లేదా కాంక్రీట్ పదార్ధములను వినియోగించి తయారు చేయకుండా వాటిని వ్యవసాయ వ్యర్థాలను వినియోగించడం ద్వారా తయారు చేస్తారు.

తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే కార్భన్ ఫుట్ ఫ్రింట్ తగ్గించడం లో కీలక పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వీరు వినియోగించే వ్యవసాయ వ్యర్థాలను సాధారణంగా రైతులు తమ పొలాలలోనే తగులపెట్టడం ద్వారా పర్యావర ణ ఇబ్బందులకు కారణమవుతుంటారు. ఇలాంటి ఈ వ్యర్థాలకు కూడా తగిన ధర
ఎకో యూ సంస్థ ద్వారా అందడంతో రైతాంగం లాభపడుతున్నారు.ఈ సరికొత్త ప్రయోగం పై కెజిఫ్ 2 కే కాకుండా బాహుబలి లాంటి ఇతర సంచలానత్మక దక్షిణాది చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన కళా దర్శకుడు తెలప్రోలు శ్రీనివాస రావు మాట్లాడుతూ ఎకో యూ వారి ఎకో బోర్డ్ అనే ఈ పర్యావరణ హిత ఉత్పత్తిపై నాకు అవగాహన ఏర్పడిందని చెప్పారు.

ఇది పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా అత్యంత చవక కూడా అవడం మాకు నచ్చిన విషయమని, ఈ ఉత్పత్తి ఇచ్చే వింటేజ్ వుడ్ ఫినిష్ ఎంతో నాణ్యతతో ఉండడమే కాకుండా పర్యావరణ హితంతో పాటూ తక్కువ ధరలో లభ్యమవ్వడం నన్ను దీని పట్ల ఎంతో ఆకర్షితుడని చేసిందని వివరించారు. ఇన్ని లాభాలున్న ఈ ఉత్పత్తిని భవిష్యత్తులో నేను చేయబోయే సినిమాలన్నింటిలోనూ వినియోగించబో తున్నానని చెప్పారు.ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసులో సంచలనాలు సృష్టిస్తున్న కె జి ఎఫ్ 2 వారు తమ సినిమాలో ప్రతిష్టాత్మకమైన సీన్ లలో కనిపించే పార్లమెంటు సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మాణానికి వినియోగించడం ద్వారా అడ్వాన్స్డ్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి రూపొందించిన ఈ ఎకో యూ సాంకేతిక పరిజ్ఞానం అందరి అభినందనలు అందుకుంటోంది.

అవసరాలకు తగినట్లుగా వంచగలగడం తో పాటూ ఫైర్ ప్రొటెక్షన్ లోయూరోపియన్ స్టాండర్డ్స్ నుఅందుకొనేలా గట్టిదనం కలిగి ఉండడం ఈ బోర్డుల లక్షణం.ఇలా తాము తయారు చేసిన ఉత్పత్తి వినియోగింప పడడం పట్ల జి పి కె రాజు, డైరెక్టర్,
ఎకో బోర్డు ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైన, విజయవంతమైన కె జి ఎఫ్ 2 సినిమాలో సెట్ నిర్మాణానికి మా ఉత్పత్తులను సినిమా బృందం ఎంపిక చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎకో వాల్ బోర్డ్ లను వినియోగించడం ద్వారా సెట్ నిర్మాతలు కనీసం 100 పూర్తిగా పెరిగిన వృక్షాలను కొట్టి వేయకుండా కాపాడిన వారయ్యారని ఆయన అభినందించారు.ఇలా ఎకో యూ వారు వ్యవసాయ వ్యర్థాలను రైతులను నుండి కొనుగోలు చేయక ముందు వారు వీటిని తమ పొలాలలో తగులపెట్టే వారు. అయితే ఎకో యూ వారు వీటిని వినియోగంలోనికి తీసుకొని రావడం ద్వారా కనీసం 20 టన్నుల కార్భన్ డై ఆక్సైడ్ పర్యావరణంలో విడుదల కాకుండా ఆపు చేయగలుగుతున్నారు.

దీంతో పాటూ ఒక టన్ను వ్యవసాయ వ్యర్థానికి మూడు వేల రూపాయాలు చెల్లించడం ద్వారా రైతులకు ఎకో యూ వారు అదనపు ఆదాయాన్ని కూడా చేకూరుస్తున్నారు.
ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను ఎకోబోర్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు
పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా తమ గత 30 సంవత్సరముల ప్రయాణంలో
రూపొందించారు. వీరు తయారు చేస్తున్న ఇలాంటి వినూత్న ఉత్పత్తులు భవిష్యత్తులో ఎన్నో సినిమా సెట్లను పర్యావరణ హితంగా రూపొందించడంలో దోహదపడుతాయనడంలో సందేహం లేదు.